Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోగొట్టుకున్న ఫోన్‌ను తెచ్చిస్తే రూ. 4 లక్షల బహుమతి... ఎక్కడ?

Webdunia
గురువారం, 25 ఏప్రియల్ 2019 (16:02 IST)
సాధారణంగా ఎవరైనా ఫోన్ పోగొట్టుకుంటే ఏం చేస్తారు. మహా అయితే దాని కోసం కొద్దిరోజులు వెతకడం చేసి, దానికి పెట్టిన ఖర్చును తలచుకుని బాధపడతారు. దానికి పెట్టిన ఖర్చు కంటే ఆ ఫోన్‌తో ముడిపడి ఉన్న అనేక బంధాలు తెగిపోతాయని బాధపడిపోతారు. అయితే ఒక ప్రముఖ మొబైల్‌ హానర్ కంపెనీ కూడా ఒక స్మార్ట్‌ ఫోన్‌‌ను పోగొట్టుకుంది. 
 
ఆ ఏముంది..! ఆ సంస్థకు ఆ ఫోన్‌ ఒక లెక్కా? అనుకోవద్దు. ఎందుకంటే అది విడుదలకు సిద్ధమవుతూ ప్రయోగ దశలో ఉన్న ఫోన్‌. కొద్దిరోజుల్లో విడుదల చేయనున్న ఆ ఫోన్‌ను తీసుకొచ్చిన వారికి 5000 యూరోలు (మన కరెన్సీలో దాదాపు రూ. 4 లక్షలు) బహుమతిగా ఇస్తామంటోంది.
 
ఇందుకోసం హానర్‌ సంస్థ ఒక ట్వీట్ చేసింది. తమ సంస్థలో పనిచేసే ఒక ఉద్యోగి ఏప్రిల్‌ 22న డస్సెడ్రాఫ్‌ నుంచి జర్మనీలోని మ్యూనిచ్‌కు ప్రయాణించే సమయంలో ఐసీఈ 1125 రైలులో ఈ ఫోన్‌ను పోగొట్టుకున్నారని తెలిపింది. అంతేకాదు, బూడిద రంగులో ఉండి పైన కవర్ ఉన్న ఈ ఫోన్‌‌ను తెచ్చి ఇచ్చిన వారికి రూ. 4 లక్షలు బహుమతిగా ఇస్తామని కూడా ప్రకటించింది. అయితే మే 21 తర్వాత తెచ్చిస్తే ఆ డబ్బు ఇవ్వమని కూడా చెప్పింది.
 
దీనికి కారణం మే 21న హానర్‌ కంపెనీ 20 సిరీస్‌లో ఒక ఫోన్‌‌ను లండన్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోందని, కనిపించకుండా పోయిన ఆ ఫోన్‌ ప్రోటో టైప్‌ ఇదే కావచ్చని పలువురు అనుమానిస్తున్నారు. అందుకే హానర్ సంస్థ ఇంత పెద్ద మొత్తంలో నగదు చెల్లిస్తామని అంటోందని చెబుతున్నారు.

త్వరలో ఈ ఫోన్‌ను అధికారికంగా విడుదల చేయనున్న నేపథ్యంలో సదరు ఉద్యోగి దాన్ని పరీక్షించే నిమిత్తం ప్రయాణంలో తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ ఫోన్‌కు సంబంధించిన ప్రత్యేకతలు కూడా ఎవరికీ తెలియకుండా ఉండేందుకే దాన్ని తెచ్చిన వారికి రూ. 4 లక్షలు ఇవ్వన్నట్లు హానర్‌ ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments