Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమాన చక్రం భాగంలో మానవ శరీరభాగాలు, అవయవాలు

Webdunia
బుధవారం, 18 ఆగస్టు 2021 (11:12 IST)
కాబూల్ విమానాశ్రయం నుంచి ఆదివారం ఎగిరిన అమెరికా వైమానికదళ కార్గో విమానంపై ఎక్కేందుకు జనం ఎగబడిన విషయం తెలిసిందే. తాలిబన్ల నుంచి తప్పించుకునేందుకు.. పరుగులు తీస్తున్న విమానాన్ని ఎక్కేందుకు ప్రయత్నించారు. టర్మాక్‌పై కూర్చుకున్న కొందరు విమానం గాల్లోకి ఎగిగిర తర్వాత కింద పడ్డారు. ఆ దృశ్యాలు అందర్నీ కలిచివేశాయి.
 
అయితే సీ-17 గ్లోబ్‌మాస్టర్ సైనిక విమానంపై ఎక్కిన కొందరు దాన్ని వీల్ భాగంలో దాక్కున్నారు. సుమారు 600 మందితో వెళ్లిన ఆ విమానం ఖతార్‌లోని ఆల్ ఉబెయిద్ ఎయిర్‌బేస్‌లో దిగింది. కానీ ఆ విమానం అక్కడ దిగిన తర్వాత వైమానిక దళ సభ్యులకు మరో షాక్ తగిలింది. విమాన చక్రం (వీల్) భాగంలో మానవ శరీరభాగాలు, అవయవాలు కనిపించినట్లు వైమానిక దళం ఓ ప్రకటనలో తెలిపింది.
 
సరుకులతో వచ్చిన తమ విమానం కాబూల్‌లో ల్యాండైన కొన్ని క్షణాల్లోనే వందలాది మంది వచ్చి ఎలా దాన్ని ఆక్రమించారో తెలియదని అమెరికా తన ప్రకటనలో పేర్కొన్నది. గ్లోబ్‌మాస్టర్ సైనిక విమానం సరుకును దించకముందే.. ఆ విమానాన్ని వందలాది మంది చుట్టుముట్టినట్లు అధికారులు తెలిపారు.
 
అయితే పరిస్థితి అదుపుతప్పుతున్నట్లు తేలడంతో.. తక్షణమే సీ-17 విమానాన్ని అక్కడ నుంచి తరలించినట్లు ఆ ప్రకటనలో చెప్పారు. కాబూల్ విమానాశ్రయంలో జరిగిన ఘటన పట్ల విచారణ చేపడుతున్నట్లు అమెరికా వైమానిక దళం చెప్పింది. విమానాశ్రయం వద్ద ఏర్పడ్డ గందరగోళంలో పలువురు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఎంతమంది మృతిచెందారన్న విషయాన్ని స్పష్టం చేయలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కల్కి ప్రీ రిలీజ్- బాధతో అల్లాడిపోయిన ప్రభాస్.. కాలి గాయం తగ్గలేదా? (video)

వరల్డ్ కప్ సెమీఫైనల్‌తో కల్కి పోటీ పడుతుందా? అదో తలనొప్పి!

విజువల్ ఫీస్ట్ లా కన్నప్ప టీజర్

'కల్కీ' బాక్సాఫీసు టార్గెట్ ఎంతంటే..!!

వరుణ్ సందేశ్ నింద కు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల జోరు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

పిల్లలు రోజూ ఫ్రైడ్ రైస్ తింటున్నారా?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments