Webdunia - Bharat's app for daily news and videos

Install App

కమలా హారిస్‌కు నచ్చిన వంటకం ప్రత్యేకం ఏంటంటే?

Webdunia
బుధవారం, 20 జనవరి 2021 (10:39 IST)
అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్షుల ప్రమాణస్వీకారానికి రానున్న అతిథులు నోరూరించే వంటకాలను ఆరగించనున్నారు. శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన ప్రముఖ చెఫ్‌ రాబర్ట్‌ డోర్సీ అతిథులకు నలభీమపాకం రుచిచూపించబోతున్నాడు. ప్రమాణస్వీకారం సందర్భంగా ఏర్పాటు చేయనున్న విందులో కమలా హారిస్‌కు ఇష్టమైన వంటకం సీఫుడ్‌ 'గంబో'ను కూడా చేర్చారు.
 
'గంబో' అనేది ఒక చిక్కనైన సూపు. దీన్ని షెల్‌ ఫిష్‌ లేదా మాంసం, కాప్సికం, ఉల్లిపాయతో తయారు చేస్తారు. 'గంబో' లూసియానా రాష్ట్ర అధికారిక వంటకం కావడం కూడా విశేషం. తనకు కూడా 'గంబో' అంటే చాలా ఇష్టమని, తాను చిన్నప్పుడు కమలా హారిస్‌తో కలిసి చదువుకున్నానని చెఫ్‌ రాబర్ట్‌ డోర్సీ చెప్తున్నారు.
 
అలాగే డిన్నర్‌ మెనూలో ఎలాంటి వంటకాలు వున్నాయంటే..?
ఎపిటైజర్‌గా..
పాంకో క్రస్టెడ్‌ క్రాబ్‌ కేక్స్‌, ఆర్గానిక్‌ కోస్టల్‌ గ్రీన్స్‌
 
మెయిన్‌ డిష్‌లుగా..
గంబోతో పాటు వైట్‌ రైస్‌, లూసియానా లవ్‌, డీప్ అంబర్‌ రౌక్స్‌, స్వీట్‌ పెప్పర్స్‌, బ్లాకెన్‌డ్‌ చికెన్‌.
 
స్వీట్లు..
బనానా రైసిన్‌ బ్రెడ్‌ పుడ్డింగ్‌, బౌర్‌బోన్‌ కారమెల్‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్ల బంద్ పై మంత్రి సీరియస్ - దిగి వచ్చిన తెలుగు ఫిలిం ఛాంబర్

Subhalekha Sudhakar: బాలు, షిన్నోవా నటించిన ఒక బృందావనం సినిమా సమీక్ష

Hebba patel: గోల్డ్ పర్చేజ్ భవిష్యత్ కు బంగారు భరోసా : హెబ్బా పటేల్

Manoj: మోహన్ బాబు ఇంటినుంచి భోజనం వచ్చేది, అమ్మవారి దయ వుంది : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

తెలుగు చిత్ర విలన్ కన్నుమూత - ప్రముఖుల సంతాపం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments