Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధానిగా రిషి సునక్ వద్దు... బోరిస్ జాన్సన్

Webdunia
శనివారం, 16 జులై 2022 (09:57 IST)
బ్రిటన్ ప్రధానమంత్రి మంత్రి రేసులో ఇన్ఫోసిస్ మాజీ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అల్లుడు రిషి సునక్ ముందంజలో ఉన్నారు. దీన్ని ఆ దేశ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ జీర్ణించుకోలేక పోతున్నారు. బ్రిటన్ ప్రధానిగా రిషి సునక్ వద్దని, ఆయన స్థానంలో మరొకరిని ఎన్నుకోవాలని కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలకు ఆయన సూచించారు. 
 
అంతేకాకుండా, బ్రిటన్ ప్రధానమంత్రి కోసం జరుగుతున్న ఎన్నికల్లో పోటీలో ఉన్న రిషి సునక్‌కు ఎలాగైనా ఓడించాలన్న పట్టుదలతో బోరిస్ జాన్సన్ అంతర్గతంగా ప్రచారం చేస్తున్నట్టు సమాచారం. సునాక్‌ను తప్ప.. మరెవరినైనా బలపరచండని తన వర్గం ఎంపీలకు జాన్సన్‌ సూచించినట్టు తెలుస్తోంది. 
 
తనపై అభియోగాలు రావడం, పలువురు మంత్రులు రాజీనామా చేయడంతో అధికార కన్జర్వేటివ్‌ పార్టీకి చెందిన జాన్సన్‌ ఈనెల 7న ప్రధాని పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే- రిషి తనకు ద్రోహం చేశారని, ఆయన కారణంగానే సొంత పార్టీ నేతలు కూడా తనకు దూరమయ్యారని బోరిస్‌ ఆగ్రహంతో ఉన్నట్టు చెబుతున్నారు. 
 
తదుపరి ప్రధానిగా ఎవరు ఉండాలన్న విషయంలో తలదూర్చబోనని, బరిలో ఉన్న ఏ అభ్యర్థినీ బలపరచనని జాన్సన్‌ బహిరంగంగా వెల్లడించినా... సునాక్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రధాని కాకూడదంటూ తన మద్దతుదారులతో ఆయన మంతనాలు సాగిస్తున్నట్టు 'ద టైమ్స్‌' కథనం పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 షూటింగ్ పూర్తి, మూడేళ్ళ మేకింగ్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments