Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బ్రిటన్ ప్రధానిగా ఇన్ఫోసిన్ నారాయణమూర్తి అల్లుడుకే మొగ్గు!

Rishi Sunak
, సోమవారం, 11 జులై 2022 (09:15 IST)
బ్రిటిన్ ప్రధానమంత్రిగా ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అల్లుడు రిషి సునక్‌కే అధిక అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ దేశ ప్రధానమంత్రి పదవికి బోరిస్ జాన్సన్ రాజీనామా చేసిన విషయం తెల్సిందే. దీంతో కొత్త ప్రధానిని ఎన్నుకునే పనుల్లో అధికార కన్సర్వేటివ్ పార్టీ నేతలు నిమగ్నమైవున్నారు. ఈ క్రమంలో మాజీ ఆర్థిక మంత్రి, నారాయణ మూర్తి అల్లుడు రిషి సునక్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. 
 
నిజానికి ప్రధానమంత్రి రేసులో తొమ్మిది మంది ఉన్నారు. విశ్వాసాన్ని తిరిగి పొంది, ఆర్థికంగా పునర్నిర్మించడానికి, దేశాన్ని ఐక్యంగా ఉంచడానికి కృషి చేస్తానని సునాక్‌ చెబుతున్నారు. పూర్తి ప్రణాళికను ఆయన ఇంకా వెల్లడించకపోయినా, పన్నుల్లో కోత గురించి ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. పన్ను విషయాల్లో ఆయన్ని నమ్మలేమనీ, ఆయనొక అబద్ధాల కోరు అని వ్యక్తిగత విమర్శలూ ప్రసార మాధ్యమాల్లో మొదలయ్యాయి. 
 
పైగా, ఆయన భార్య అక్షతా మూర్తిపై పన్ను ఎగవేత ఆరోపణలు ఉన్నాయి. అయితే, సునాక్‌ వైపు ఎక్కువమంది మొగ్గు చూపిస్తుండగా వాణిజ్య శాఖ సహాయ మంత్రిగా వ్యవహరించిన పెన్నీ మాడెంట్‌ ఆ తర్వాతి స్థానంలో నిలుస్తున్నారు. 9 మంది పోటీదారులకు అదనంగా విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రుస్‌ కూడా బరిలో దిగవచ్చని వినవస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పంచాయతీ తీర్పు - గ్రామ పెద్దల సమక్షంలో వ్యక్తి సజీవదహనం