Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో భారీ వర్షాలు.. 21మంది మృతి

Webdunia
సోమవారం, 23 ఆగస్టు 2021 (09:33 IST)
America
అమెరికాలోని టెన్నెస్సీలో భారీ వర్షాలకు 21 మంది మృతిచెందారు. డజన్ల సంఖ్యలో తప్పిపోయారు. టెన్నిస్సీలోని హప్‌రేస్‌ కౌంటీలో శనివారం వర్షం ముంచెత్తింది. శనివారం ఒకేరోజు 38 సెంటీమీటర్ల (15 ఇంచులు) వాన కురిసిందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో వరదల తాకిడికి స్థానిక రోడ్లు, హైవేలు, బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి. సుమారు 21 మంది మరణించారు. 
 
డజన్ల కొద్ది మంది గల్లంతయ్యారని దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. మొదట 40 మందికిపైగా తప్పిపోయారని సమాచారం తమకు అందిందని, అయితే వారిలో 20 మంది ఆచూకీ లభించిందని అధికారులు పోలీసులు తెలిపారు. 
 
టెన్నెస్సీ చరిత్రలో ఇంత భారీ వర్షం నమోదవడం, వరదలు సంభవించడం ఇదే మొదటిసారని చెప్పారు. వరదల ధాటికి భారీ సంఖ్యలో వాహనాలు కొట్టుకుపోయాయని, చాలా ప్రాంతాలు నీట మునిగాయని వెల్లడించారు. తప్పిపోయినవారికో గాలింపు కొనసాగుతున్నదని వెల్లడించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లంచ‌గొండుల‌పై సేనాప‌తి స్వైర విహారం భారతీయుడు 2’ ట్రైలర్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments