Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

‘బ్రేక్‌ ది ఐస్‌ ఛాలెంజ్‌’ లో స‌త్తా చాటిన టీజీ విశ్వ‌ప్ర‌సాద్ త‌న‌యుడు ప్రణవ్‌ ప్రసాద్‌

Advertiesment
Break the Ice Challenge
, శనివారం, 21 ఆగస్టు 2021 (16:40 IST)
Pranav Prasad
చంద్రుడిపై మానవ మనుగడ కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘బ్రేక్‌ ది ఐస్‌ ఛాలెంజ్‌’లో ఇద్దరు తెలుగు తేజాలు సత్తా చాటారు. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన ఈ పోటీలో ప్ర‌ముఖ చిత్ర నిర్మాణ సంస్థ‌  పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి టీజీ విశ్వ‌ప్ర‌సాద్ కుమారుడు ప్రణవ్‌ ప్రసాద్‌, కరణం సాయి ఆశీష్‌కుమార్, చుండూరు అమరేశ్వరప్రసాద్  రూపొందించిన ప్రాజెక్టుకు టాప్‌ టెన్‌లో స్థానం దక్కింది. దీంతో వీరికి రూ.25 వేల డాలర్లు (రూ.18 లక్షలు) లభించాయి. 
 
అలాగే ఫేజ్‌–2లో నాసాతో కలిసి రెండేళ్లపాటు పనిచేసే అవకాశం దక్కింది. బ్రేక్‌ ది ఐస్‌ ఛాలెంజ్‌ పేరుతో నిర్వహించిన దీనికి 48 దేశాల నుంచి అనేక యూనివర్సిటీలు, పరిశోధన సంస్థలు, శాస్త్రవేత్తలు, విద్యార్థుల నుంచి 374 ప్రాజెక్టులు వచ్చాయి. ఏయూ నుంచి ఎంటెక్‌ పూర్తి చేసిన ఆశీష్‌కుమార్, అమరేశ్వరప్రసాద్‌లతో పాటు యూఎస్‌ నుంచి ప్రణవ్‌ప్రసాద్‌ బృందం రూపొందించిన ప్రాజెక్టు టాప్‌ టెన్‌లో నిలిచి అవార్డు పొందింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీకాంత్ ఆవిష్క‌రించిన‌ `సైదులు` చిత్ర లోగో