Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీవాస్‌ దర్శకత్వంలో గోపీచంద్‌ 30వ సినిమా

Advertiesment
Srivas
, బుధవారం, 14 జులై 2021 (12:23 IST)
Gopichand 30 cinema
గోపీచంద్‌ హీరోగా నటించిన ‘లక్ష్యం’ చిత్రంతో దర్శకులుగా పరిచయమైయ్యారు శ్రీవాస్‌. ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత మళ్లీ హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్‌ కాంబినేషన్‌లో వచ్చి న మరో చిత్రం ‘లౌక్యం’ సెన్సేషనల్‌ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో హాట్రిక్‌ ఫిల్మ్‌ను బుధవారం అధికారికంగా ప్రకటించారు.
 
గోపీచంద్‌ కెరీర్‌లో ఇది 30వ చిత్రం. పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్‌ కూచిభొట్ల ఈ చిత్రానికి సహ నిర్మాత. విభిన్నమైన జానర్‌ సినిమాలతో, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే చిత్రాలను అందించే సంస్థగా ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకున్న పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ హీరో గోపీచంద్‌తో చేస్తున్న తొలి చిత్రం ఇది.
 
గోపీచంద్‌ 30వ చిత్రం అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌ను గమనిస్తే..కోల్‌కత్తాలోని హౌరా బ్రిడ్జి మ‌రియు ప్రజలు గూమికూడి ట్రాఫిక్‌తో ఉన్న కోల్‌కత్తాలో ఫేమస్‌ కాళీమాత విగ్రహం కనిపిస్తున్నాయి. ఈ అంశాలు గోపీచంద్, శ్రీవాస్‌ కాంబినేషన్‌లో వస్తున్న ఈ థర్డ్‌ ఫిల్మ్‌పై మరిన్ని అంచనాలను క్రియేట్‌ చేస్తున్నాయి. అలాగే ఈ సినిమా కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో మరింత ఆసక్తికరంగా సాగుతుందని తెలుస్తుంది.
 
గోపీచంద్, శ్రీవాస్‌ క్రేజీ కాంబినేషన్‌ను దృష్టిలో పెట్టుకుని భూపతిరాజా మంచి కథను అందించారు. స్టోరీ విన్న గోపీచంద్‌ ఇంప్రెస్‌ అయ్యారు. దర్శకుడు శ్రీవాస్‌తో మరోసారి అసోసియేట్‌ అవుతున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. ఫ్యామిలీ ఎమోషన్స్, హిలేరియస్‌ అంశాలను కలగలిపి ఉండే ఈ పర్‌ఫెక్ట్‌ ఫ్యామిలీఎంటర్‌టైనర్‌ మూవీ ‘లక్ష్యం’, ‘లౌక్యం’ చిత్రాల మాదిరిగానే ప్రేక్షకులను అలరించే విధంగా ఉండనుంది. భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమా టైటిల్‌ ఖరారు కావాల్సి ఉంది.
 
ప్రస్తుతం గోపీచంద్ మారుతి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న‌‘పక్కా కమర్షియల్‌’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్‌ పూర్తయిన వెంట‌నే  ఆయన 30వ మూవీ షూటింగ్‌ స్టార్ట్‌ అవుతుంది. ఈ సినిమాకు గురించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.
నిర్మాత‌: టీజీ విశ్వప్రసాద్‌,  సహ నిర్మాత: వివేక్‌ కూచిభొట్ల, స్టోరీ: భూపతిరాజా.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చాలామందికి ఆ లాజిక్ తెలీదుః త‌నికెళ్ళ భ‌ర‌ణి