Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీకాంత్ ఆవిష్క‌రించిన‌ `సైదులు` చిత్ర లోగో

శ్రీకాంత్ ఆవిష్క‌రించిన‌ `సైదులు` చిత్ర లోగో
, శనివారం, 21 ఆగస్టు 2021 (16:27 IST)
Srikanth- saidulu logo
బ్రేవ్ హార్ట్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై  బాబా పి.ఆర్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతోన్న చిత్రం ``సైదులు``.  అక్టోబ‌ర్ లో షూటింగ్ ప్రారంభించుకోనున్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగోను  శుక్ర‌వారం హీరో శ్రీకాంత్ త‌న నివాసంలో ఆవిష్క‌రించారు. అనంత‌రం శ్రీకాంత్ మాట్లాడుతూ,``సైదులు` కాన్సెప్ట్ కూడా విన్నాను ఎంతో ఇంట్ర‌స్టింగ్ గా అనిపించింది. ఈ సినిమా విజ‌యం సాధించి యూనిట్ అంద‌రికీ మంచి పేరు రావాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నా`` అన్నారు.
 
చిత్ర ద‌ర్శ‌కుడు బాబా పి.ఆర్ మాట్లాడుతూ, సినిమా ప్రీ -ప్రొడక్ష‌న్ అంతా పూర్త‌యింది. అక్టోబ‌ర్ లో షూటింగ్ స్టార్ట్ చేసి సింగిల్ షెడ్యూల్ లో సినిమాను పూర్తి చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. హ‌క్కుల కోసం, స్వేచ్ఛ కోసం ఒక ఊరి జ‌నం చేసిన తిరుగుబాటు నేప‌థ్యంలో ఈ చిత్ర క‌థ ఉంటుంది. త్వ‌ర‌లో న‌టీన‌టుల వివ‌రాలు వెల్ల‌డిస్తాం`` అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీః పి.య‌స్ మ‌ణిక‌ర్ణ‌న్‌; సంగీతంః ఆర్‌.ఆర్‌.ధృవ‌న్‌.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆర్ఆర్ఆర్ రిలీజ్ సంక్రాంతికి కూడా డౌటే? ఉగాదికి వస్తోన్న RRR