Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా నుంచి పూర్తిగా కోలుకోని డోనాల్డ్ ట్రంప్.. వణికిపోతున్న వైట్‌హౌస్ సిబ్బంది

Webdunia
బుధవారం, 7 అక్టోబరు 2020 (11:07 IST)
కరోనా వైరస్ బారినపడిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. దీంతో ఆయన వెంట ఉండే వైట్‌హౌస్ సిబ్బంది వణికిపోతున్నారు. తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని, భయంభయంతో విధులు నిర్వహిస్తున్నారు. 
 
కాగా, కరోనా వైరస్ బారినపడిన ట్రంప్ రెండు మూడు రోజుల పాటు అమెరికా సైనిక ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. ఈ వైరస్ నుంచి ఆయన పూర్తిగా కోలుకోకముందే తిరిగి తన అధ్యక్ష కార్యాలయమైన శ్వేతసౌధానికి చేరుకున్నారు. దీంతో పైగా, మాస్క్ తీసేసి తిరుగుతున్నారు. దీంతో వైట్‌హౌస్ సిబ్బంది భయంతో వణికిపోతున్నారు. 
 
ఇదే అంశంపై ట్రంప్ మాట్లాడుతూ, 'రిస్క్ ఉందని నాకు తెలుసు. ఇప్పుడు మరింత మెరుగ్గా ఉన్నాను. నా శరీరంలో వ్యాధి నిరోధకత ఉండి ఉండవచ్చు. నేను చేసినట్టుగా ఏ నాయకుడూ చేయలేడు. నేను వెనక్కు తగ్గబోను. నా ప్రత్యర్థి బైడెన్‌తో 15న జరుగనున్న మియామీ డిబేట్‌లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నాను. నేనే ముందుంటాను. నేనే నాయకత్వం వహిస్తాను' అంటూ ట్వీట్ చేశారు. 
 
ఇదిలావుండగా, ట్రంప్ ఇంకా పూర్తిగా కోలుకోలేదని, ఆయన కోలుకునేందుకు మరో వారం రోజుల సమయమన్నా పడుతుందని ట్రంప్ ప్రత్యేక వైద్యుడు డాక్టర్ సీన్ కాన్లే వ్యాఖ్యానించడం గమనార్హం. ట్రంప్‌కు ఇప్పటివరకూ నాలుగు డోస్‌ల రెమిడెసివిర్‌ను వైద్యులు ఇచ్చారని అన్నారు. 
 
ఇతరులకు వ్యాధి వ్యాపించకుండా ఉండాలంటే, కరోనా బారినపడిన వారు కనీసం 10 రోజులు ఐసోలేషన్‌లో ఉండాలని నిపుణులు చెబుతున్నారు. కానీ, ట్రంప్ మాత్రం వారి వ్యాఖ్యలను ఏమాత్రం పట్టించుకోకుండా వైట్‌హౌస్‌లో యధేచ్చగా తిరుగుతున్నారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments