Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాకు చుక్కలు... సముద్ర జాలాల్లో అమెరికా యుద్ధనౌకలు.. భారత్ కూడా..?

Webdunia
మంగళవారం, 21 జులై 2020 (11:08 IST)
Ocean ships
దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యం కోసం ప్రయత్నాలను చేస్తున్న డ్రాగన్‌ దేశానికి బుద్ధి చెప్పడంలో భాగంగా అమెరికా తన శక్తివంతమైన యుద్ధ నౌకలను ఇటీవల ఆ సముద్ర జలాల్లో మోహరించింది. తద్వారా తమ మిత్ర దేశాలకు అమెరికా మద్దతును ప్రకటించింది. 
 
చైనాకు తమ సైనిక సామర్థ్యం గురించి వ్యూహాత్మక హెచ్చరికలు చేయడంలో భాగంగానే భారత్‌ అమెరికాతో కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సోమవారం నిర్వహించిన ఈ పాసింగ్‌ ఎక్సర్‌సైజ్‌లో అమెరికాకు చెందిన నిమిజ్‌, రోనాల్డ్‌ రేగన్‌ యుద్ధ నౌకలతో పాటు భారత్‌కు చెందిన పలు గస్తీ నౌకలు, జలాంతర్గాములు పాల్గొన్నాయి.
 
తూర్పు లఢక్‌లో ఇటీవల దుశ్చర్యకు పాల్పడిన చైనాకు వీలు చిక్కినప్పుడల్లా భారత్‌ గట్టి హెచ్చరికలను పంపుతూనే ఉంది. తాజాగా అండమాన్‌ అండ్‌ నికోబార్‌ దీవుల సముద్ర జలాల్లో అమెరికా యుద్ధ నౌకలతో కలిసి సైనిక విన్యాసాలను భారత్‌ నిర్వహించింది. దీంతో డ్రాగన్ కంట్రీకి చుక్కెదురైంది. కరోనాను ఇతర దేశాలకు వ్యాపించకుండా చేయడంలో చైనా విఫలమైందని.. అమెరికా గుర్రుగా వున్న సంగతి తెలిసిందే. 
 
చైనాలో ఈ వైరస్‌కు బ్రేక్ వేసి వుంటే ఇతర దేశాలకూ ఈ వ్యాధి సోకేది కాదని అమెరికా ఫైర్ అవుతుంది. ఫలితంగా చైనాకు బుద్ధిచెప్పేందుకు అమెరికా ఆత్రుతతో ఎదురుచూస్తోంది. ఇందులో భాగంగానే యుద్ధ నౌకలతో పాసింగ్ ఎక్సర్‌సైజ్ జరిగిందని విశ్లేషకులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments