Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేనో తెలివితక్కువ వాడిని: పాకిస్తాన్ ప్రధానమంత్రి

Webdunia
శనివారం, 28 మే 2022 (17:33 IST)
తను ఓ తెలివితక్కువ వాడిననీ, ఫూల్‌ననీ పాకిస్తాన్ ప్రధానమంత్రి అన్నారు. ఈ మాట ఎందుకు అన్నారంటే.... ఆయనపై అవినీతి, అక్రమ సంపాదన కేసు నమోదైంది. ఈ కేసు విచారణలో భాగంగా ఆయన కోర్టుకు హాజరయ్యారు. అవినీతి, అక్రమ సంపాదన గురించి కోర్టు ప్రశ్నించినప్పుడు ఆయన ఇలా స్పందించారు.

 
ఈ కేసుపై ఆయన కోర్టు అనుమతి తీసుకుని మాట్లాడుతూ.. నేను దేవుడు దయవల్ల పాకిస్తాన్ దేశానికి ప్రధానమంత్రి అయ్యాను. ఐతే పంజాబ్ ముఖ్యమంత్రిగా వున్న పన్నెండున్నరేళ్ల కాలంలో కనీసం జీతం కూడా తీసుకోకుండా పనిచేసాను. నిజంగా నేను ఓ తెలివితక్కువ వాడిని, ఎంతమాత్రం జీతం తీసుకోకుండా ఎవరైనా పనిచేస్తారా అంటూ చెప్పారు.

 
తను ముఖ్యమంత్రిగా వున్న సమయంలో సెక్రటరీ తమకు ప్రయోజనం చేకూర్చే నోట్ పంపినా దానిని తిరస్కరించాననీ, అందువల్ల తమ కుటుంబం 2 బిలియన్ల పాకిస్తానీ రూపీలు నష్టపోయినట్లు చెప్పారు. కాగా పదవీచ్యుతుడైన మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాత్రం షెహబాజ్ పైన ఆరోపణలు గుప్పిస్తున్నారు. వేలకోట్లు కొల్లగొట్టిన అవినీతిపరుడు పాకిస్తాన్ ప్రధానిగా అనర్హుడు అంటూ ఆందోళనలు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments