Webdunia - Bharat's app for daily news and videos

Install App

300 మొసళ్లను చంపేశారు.. ఎందుకంటే..

ఓ గ్రామస్తుడిని మొసలి చంపిందని ఏకంగా 300 మొసళ్లను చంపేశారు గ్రామస్తులు. ఈ ఘటన ఇండోనేషియాలోని పుపువా ప్రావిన్స్‌‌లో చోటుచేసుకుంది. ఓ మొసళ్ల ఎన్‌క్లోజర్‌ను అధికారులు జనావాసాల మధ్యలో ఉంచారు.

Webdunia
మంగళవారం, 17 జులై 2018 (08:36 IST)
ఓ గ్రామస్తుడిని మొసలి చంపిందని ఏకంగా 300 మొసళ్లను చంపేశారు గ్రామస్తులు. ఈ ఘటన ఇండోనేషియాలోని పుపువా ప్రావిన్స్‌‌లో చోటుచేసుకుంది. ఓ మొసళ్ల ఎన్‌క్లోజర్‌ను అధికారులు జనావాసాల మధ్యలో ఉంచారు. అప్పటివరకు సమస్య కానీ వాళ్లకు.. ఇటీవల సుగితో(48) అనే వ్యక్తి గడ్డి కోయడానికి వెళ్లి ప్రమాదవశాత్తు మొసళ్లు ఉన్న ఎన్‌క్లోజర్‌లోకి పడిపోయాడు. దీంతో ఓ మొసలి అతన్ని చంపేసింది.
 
ఈ సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు.. మొదట సుగితో కుటుంబంతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తర్వాత జనావాసాల మధ్య ఉండడాన్ని తప్పుబట్టారు. వెంటనే అక్కడి నుండి ఎన్‌‌క్లోజర్‌‌ను తీసివేయాలంటూ డిమాండ్ చేశారు. ఎన్‌క్లోజర్‌ సిబ్బంది నష్టపరిహారం చెల్లిస్తామన్నా గ్రామస్తులు అంగీకరించలేదు. 
 
వెంటనే ఎన్‌క్లోజర్‌ తీసేయాలన్న గ్రామస్తుల మాటలను సిబ్బంది పెడచెవిన పెట్టడంతో వందల సంఖ్యలో మొసళ్ల ఎన్‌క్లోజర్‌ దగ్గరికి కత్తులు, కట్టెలతో వెళ్లారు. ఒక్కొక్క మొసలిని బయటికిలాగి మరీ దారుణంగా చంపేశారు. అలా ఏకంగా 300 మొసళ్లను చంపేశారు. ఎంత అడ్డు చెప్పినా స్థానికులు వినకుండా దాడి చేశారని పోలీసులు తెలిపారు. దీనిపై ఇండోనేషియా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments