Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో మ‌ళ్ళీ మృత్యు ఘంటిక‌లు...రోజూ 2 వేల క‌రోనా మరణాలు

Webdunia
సోమవారం, 20 సెప్టెంబరు 2021 (12:26 IST)
అగ్రరాజ్యం అమెరికాను కరోనా వైరస్ మ‌రో మారు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తున్నాయి. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ,  ప్రతి రోజు లక్షల్లో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. జులై నుంచి కేసులు తగ్గు ముఖం పట్టినప్పటికీ మరణాలు మాత్రం పెరిగిపోతున్నాయి. ప్రతి రోజూ రెండు వేలకు పైగా మరణాలు నమోదవుతున్నాయి. కొవిడ్‌తో ఒక్క రోజే 2,579 మంది మరణించినట్లు 'న్యూయార్క్‌ టైమ్స్‌' వెల్లడించింది. గడిచిన వారంలో ప్రతిరోజూ సగటున 2,012 మంది మృతిచెందినట్లు తెలిపింది.
 
కరోనా మరణాలు ముఖ్యంగా ఫ్లోరిడా, టెక్సాస్‌, కాలిఫోర్నియా నుంచి అధికంగా నమోదవుతున్నాయి. అమెరికాలో సెప్టెంబర్‌ 13న 2.85 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. అనంతరం తగ్గుతూ వచ్చాయి. ఈ శుక్రవారం 1.65 లక్షల మంది వైరస్‌ బారిన పడ్డారు. అయితే కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ మరణాలు మాత్రం రెండువేలకు పైగానే నమోదవుతున్నాయి. డెల్టా వేరియంట్‌ కారణంగానే భారీ స్థాయిలో జనం వైరస్‌ బారిన పడుతున్నట్లు అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం వెల్లడించింది. 99 శాతం కేసులు డెల్టా వేరియంట్‌వేనని తెలిపింది. అగ్రరాజ్యంలో ఇప్పటివరకు 54 శాతం ప్రజలు రెండు డోసులు తీసుకోగా.. 63 శాతం మొదటి డోసు తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

Suhas: హే భగవాన్! నాకు హిట్ వచ్చేలా చేయ్ : సుహాస్

ఒత్తిడిలో ఉంటే మద్యం సేవిస్తా : పవన్ కళ్యాణ్ హీరోయిన్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments