Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రాండ్లు తాగలేక విసిగిపోయాం.. చల్లని బీర్లు కావాలి...

Webdunia
సోమవారం, 20 సెప్టెంబరు 2021 (11:57 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం చేపట్టారు. ఈ ఓట్ల లెక్కింపు సమయంలో చాలా సిత్రాలే కని పించాయి. ఇలాంటి సిత్రాలు అనంతపురం జిల్లాలో కనిపించాయి. ఈ జిల్లాలో 62 జడ్పీటీసీలకు ఎన్నికలు జరిగితే.. అగళి జడ్పీటీసీగా టీడీపీ అభ్యర్థి గెలుపు జెండా ఎగరేశాడు. 60 చోట్ల వైపీసీ అభ్యర్థులు గెలిచిచారు. రొళ్ల నుంచి ఇండిపెండెంట్‌ గెలిచారు. 
 
మడకశిర మండలంలో అధికారుల అజాగ్రత్త వల్ల గంగులవాయి పాళ్యం కాంగ్రెస్‌ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి గంగమ్మకు డిక్లరేషన్‌ ఇచ్చే సమయంలో వైసీపీ డిక్లరేషన్‌ ఫామ్‌ ఇచ్చారు. తర్వాత మేల్కొన్న అధికారులు కాంగ్రెస్‌ గుర్తుపై గెలిచినట్లు డిక్లరేష‌న్‌ ఫామ్‌ ఇచ్చారు. 
 
నల్లచెరువు మండలంలో ‘నల్లచెరువు యూత్‌’ పేరుతో బ్యాలెట్‌ బాక్సులో ఒక చీటీ బయటపడింది. మద్యం దుకాణాల్లో చల్లని బీర్లు, మంచి బ్రాండ్లు అందుబాటులో ఉంచాలి అంటూ అందులో ఉండటంతో లెక్కింపు అధికారులతో పాటు అక్కడున్న అందరూ నవ్వుకున్నారు.  
 
'వివిధ రకాల బ్రాండ్లు తాగలేక విసిగిపోయాం. మంచి బ్రాండ్లు సరఫరా చేయండి. కూల్‌ బీర్లు అందుబాటులో ఉండేలా చూడండి' ఇట్లు మందుబాబుల యూత్‌ అధ్యక్షుడు.. అని రాసి ఉన్న చీటీని అధికారులు గుర్తించారు. ఈ చీటీ జిల్లా నల్లచెరువు మండలం కడవవాండ్లపల్లి ఎంపీటీసీ బ్యాలెట్‌ బాక్సులో లభ్యమైంది. 
 
కౌంటింగ్ సిబ్బంది ఆ లేఖను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. రాసిన వ్యక్తి ఎవరో తెలియదు గానీ.. ప్రస్తుతం ఇది నల్లచెరువులో ఓ హాట్ టాపిక్‌గా మారింది. స్థానిక యువత అయితే మేం చేయలేని పని ఎవరో చేశారని సరదాగా చర్చించుకుంటున్నారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments