Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాలిబన్ల చెరలో అఫ్గాన్ తొలి మహిళా గవర్నర్ సలీమా?

Webdunia
గురువారం, 19 ఆగస్టు 2021 (09:50 IST)
'తాము మారిపోయామని, ఇస్లామిక్ చట్టాల ప్రకారం మహిళలకు అన్ని హక్కులు కల్పిస్తామని' తాలిబన్లు తమ తొలి మీడియా సమావేశంలో భాగంగా మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, మహిళలు మాత్రం తాలిబన్ల  రాజ్యంలో తమ హక్కులకు భంగం వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినా మహిళల పట్ల తాలిబన్ల వైఖరి మారేట్లు కనపడట్లేదు. 
 
తాజాగా అఫ్గాన్‌ తొలి మహిళా గవర్నర్‌ సలీమా మజారీని తాలిబన్లు బంధించినట్లు తెలుస్తోంది. తుపాకీ చేతబట్టి తమతో పోరాడిన ఆమెపై తాలిబన్లు పైచేయి సాధించినట్లు సమాచారం. కాగా అఫ్గనిస్తాన్‌లోని బల్ఖ్‌ ప్రావిన్స్‌ లోని చహర్‌ కింట్‌ జిల్లాకు చెందిన సలీమా అఫ్గన్‌ తొలితరం మహిళా గవర్నర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు.
 
ఓవైపు అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ సహా ఇతర నేతలంతా పారిపోతున్నా బల్ఖ్‌ ప్రావిన్స్‌ను తాలిబన్లు ఆక్రమించకుండా ఆమె ఎదురొడ్డి నిలిచారు. కానీ.. తాలిబన్లు ఆ ప్రాంతంపై పట్టు సాధించారు. ఈ క్రమంలో సలీమాను వారు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. 
 
మరోవైపు.. అఫ్గనిస్తాన్ తాలిబన్ల వశమైన నేపథ్యంలో అక్కడి మహిళలు హక్కుల కోసం పోరాడుతున్నారు. కాబుల్‌ వీధుల్లో నలుగురు మహిళలు నిరసన తెలిపారు. తమ హక్కులు కాపాడుకుంటామంటూ ఫ్లకార్డుల ప్రదర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం... ఆహ్వానం కూడా...!!

కథంతా చెప్పేసిన థీమ్ ఆఫ్ క‌ల్కి లిరిక‌ల్ వీడియో

మైఖేల్ జాక్సన్‌కు కలిసిరానిది.. థ్రిల్లర్‌ ఇచ్చిన గిఫ్ట్

నిఖిల్.. స్వయంభు కొత్త షెడ్యూల్ మారేడుమిల్లిలో ప్రారంభం

లంచ‌గొండుల‌పై సేనాప‌తి స్వైర విహారం భారతీయుడు 2’ ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments