Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీచ్‌లో దొరికిన 57 ఏళ్ల నాటి బాటిల్...

Webdunia
గురువారం, 21 ఫిబ్రవరి 2019 (13:51 IST)
టెక్సాస్‌లో ఓ జంట యధావిధిగా బిచ్‌లో వాకింగ్‌కి వెళ్లారు. అక్కడ అలలతోపాటు కొట్టుకు వచ్చి చెట్టు కొమ్మల సందులో పడి ఉన్న పాత బాటిల్ వారికి తారసపడింది. దానికి ఆకర్షితులైన వారు, దానిని తీసుకుని చూశారు. అందులో ఓ ఉత్తరం వ్రాసి మూసి ఉంది. ఇలా ఉత్తారాలు వ్రాసి బాటిల్‌లో పెట్టి సముద్రంలో పడేయటం సాధారణం. 
 
కానీ 57 ఏళ్ల క్రితం నాటి ఈ బాటిల్ గురించి తెలుసుకోవాలనుకున్నారు. ఆ బాటిల్‌లోని ఉత్తరంలో బాటిల్‌ని బద్దలు కొట్టండి అని వ్రాయడంతోపాటు 002338 అనే సంఖ్య కూడా ఉంది. దానిని పగలగొట్టడం ఇష్టంలేని దంపతులు పది నిమిషాలు శ్రమించి మూత వద్దనున్న కార్క్‌ని తొలగించి ఉత్తరాన్ని చదివారు. దాన్ని చదివిన జిమ్ డ్యూక్, కేండీ దంపతులు తెలుసుకున్న విషయం ఏమిటంటే, ఆ సీసాను యూఎస్ బ్యూరో ఆఫ్ కమర్షియల్ ఫిషరీస్‌కు చెందిన గాల్వెస్టన్ బొటానికల్ లేబొరేటరీస్ వారు సముద్రంలో పడేశారు. 
 
మెక్సికోలోని ఈ సంస్థ 1962,1963ల్లో ఇలా కొన్ని వందల ఉత్తరాలను సీసాల్లో పెట్టి సముద్రంలో పడేసింది. వీటిని తిరిగి తమకు పంపిన వారికి అప్పట్లో 50 సెంట్లు (రూ.35పైగా) బహుమతి ఇస్తామని కూడా వెల్లడించింది. ఆ దంపతులు దానిని గురించి సంస్థకు తెలిపారో లేదో తెలియదు గానీ, ఈ సీసాను మాత్రం తమ కలెక్షన్‌లో ఉంచుకుంటామని వెల్లడించారు. బాటిల్‌ని ఓపెన్ చేయడం, చదవడం, ఈ తతంగాన్నంతా వారు ఫేస్‌బుక్ లైవ్ వీడియో తీసారు. సాధారణంగా రోజూ బీచ్‌కు వస్తామని, అక్కడ దొరికే అరుదైన వస్తువులను దాచుకుంటామని జిమ్ దంపతులు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments