Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటి కింద 45 పాములు ఉన్నాయా??.. వీడియో

Webdunia
గురువారం, 21 మార్చి 2019 (14:10 IST)
మనం ఎప్పుడైనా ఒక్క పామును చూస్తే భయంతో అటు ఇటూ పరుగులు తీస్తాం. అలాంటిది పదుల సంఖ్యలో పాములు ఒకేచోట ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఎంత భయానకంగా ఉంటుంది కదూ..ఇలాంటి అనుభవమే అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం అల్బానీలో ఉండే ఓ ఇంటి యజమానికి ఎదురైంది. తన ఇంటి కింద ఓ కేబుల్ కోసం వెతికిన అతనికి పదుల సంఖ్యలో రాటిల్ స్నేక్స్ కనిపించాయి. వాటిని చూసి అతడు ఆందోళన చెందాడు. వెంటనే బిగ్ కంట్రీ స్నేక్ రిమూవల్‌కు ఫోన్ చేసాడు.
 
స్నేక్ రిమూవల్ టీమ్ అక్కడికి చేరుకుని, పరిశీలించగా..ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 45 రాటిల్ స్నేక్స్ అక్కడ కనిపించాయి. వాటిని ఒక్కొక్కటిగా చాలా జాగ్రత్తగా బయటకు తీసి అన్నింటినీ సమీపంలోని అడవిలో విడిచిపెట్టారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా ఆ సంస్థ ఫేస్‌బుక్‌లో షేర్ చేసింది. ఈ వీడియోకి ఇప్పటికే 11లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.
 
రాటిల్ స్నేక్ ఎంతో ప్రమాదకరమైన పాము జాతి. గతంలో కూడా ఇదే టెక్సాస్ రాష్ట్రంలో మరో వ్యక్తికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. తన షెడ్‌లో ఏకంగా 30 రాటెల్ స్నేక్స్ అతనికి కనిపించాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments