Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లో ఘోరం.. మంటల్లో దహనమైన ప్రయాణికులు

Webdunia
ఆదివారం, 29 జనవరి 2023 (14:13 IST)
పాకిస్థాన్ దేశంలో ఘోరం జరిగింది. బలూచిస్థాన్ ప్రాంతంలో లాస్ బెలాలో కొంతమంది ప్రయాణికులతో వెళుతున్న బస్సు ఒకటి అదుపుతప్పి కాలువలో పడింది. దీంతో బస్సుకు నిప్పు అంటుకున్నాయి. ఈ కారణంగా బస్సులో ప్రయాణిస్తున్న వారిలో 39 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో అనేక మంది మంటల్లో కాలిపోయారు. 
 
ప్రమాద సమయంలో బస్సులో సిబ్బంది సహా 48 మంది ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. బస్సు అదుపుతప్పి కాలువలో పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో చాలా మంది కాలిపోయారని, ఫలితంగా మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా మారిపోయాయని సహాయక సిబ్బంది తెలిపారు. 
 
కాగా, క్వెట్టా నుంచి కరాచీకి వెళుతుండగా, బస్సు ప్రమాదానికి గురైందని అధికారులు తెలిపారు. కొండపై మూల మలుపు వద్ద ఉన్న వంతెన వద్ద బస్సు అదుపు తప్పి, రెయిలింగ్‌ను ఢీకొనడంతో కాలువలో పడిపోయిందని తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో అనేక మంది పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments