Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోచైనా సరిహద్దుల్లో 19 మంది కూలీల మిస్సింగ్

Webdunia
మంగళవారం, 19 జులై 2022 (12:21 IST)
భారత్, చైనా దేశాల సరిహద్దుల్లో 19 మంది కూలీలు అదృశ్యమయ్యారు. వారికోసం భారత సైన్యం ముమ్మరంగా గాలిస్తుంది. వీరంతా ఇరు దేశాల మధ్య ఉన్న వాస్తవాధీన రేఖ వద్ద నిర్మాణ పనుల్లో ఉన్నారు. వీరి ఆచూకీ గత రెండు వారాలుగా తెలియరావడం లేదు. 
 
అయితే, వీరిలో ఒకరి మృతదేహం సమీపంలోని నదిలో లభ్యమైనట్లు కథనాలు వస్తున్నాయి. మిగిలిన వారు కూడా నదిలో కొట్టుకుపోయి ఉండొచ్చని అనధికారిక సమాచారం. దీంతో అదృశ్యమైన కూలీల కోసం అధికారులు గాలింపు ముమ్మరం చేశారు. 
 
అరుణాచల్‌ ప్రదేశ్‌లోని మారుమూల కురుంగ్‌ కుమే జిల్లాలోని దమిన్‌ సర్కిల్‌లో సరిహద్దు రహదారుల సంస్థ (బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ - బీఆర్‌ఓ) రోడ్డు నిర్మాణ పనులు చేపట్టింది. ఇక్కడ పనిచేసేందుకు ఓ కాంట్రాక్టర్‌ 19 మంది కూలీలను అస్సాం నుంచి తీసుకొచ్చారు. 
 
బక్రీద్‌ పండగ నిమిత్తం వీరు తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు సెలవు అడగ్గా.. కాంట్రాక్టర్‌ అందుకు అంగీకరించలేదు. దీంతో ఈ నెల 5వ తేదీన ఈ కూలీలంతా తమ శిబిరాల నుంచి పారిపోయారు. నాటి నుంచి వీరు కన్పించకుండా పోయినట్లు తెలుస్తోంది.
 
వీరంతా కన్పించకుండాపోయినట్లు జులై 13న స్థానిక పోలీసుస్టేషన్‌లో కాంట్రాక్టర్‌ ఫిర్యాదు చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు గాలింపు చేపట్టారు. నిర్మాణ సైట్‌ నుంచి వీరంతా అడవి మార్గంలో కాలినడకన వెళ్లి ఉంటారని, ఆ క్రమంలో దారితప్పి అడవిలో అదృశ్యమై ఉంటారని పోలీసులు భావించారు. 
 
దమిన్‌ ప్రాంతంలోని కుమే నదిలో ఇటీవల ఓ మృతదేహం లభ్యమైంది. అది అదృశ్యమైన కూలీల్లో ఒకరిదంటూ సోషల్‌మీడియా, స్థానిక మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. పారిపోతున్న క్రమంలో కూలీలంతా ప్రమాదవశాత్తూ నదిలో పడిపోయి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం