Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలు తోడుకి పెరుగు ఇక అక్కర్లేదు.. మరి ఎలా?

సాధారణంగా పాలు తోడుకి పెరుగు తప్పనిసరి. కానీ, ఇకపై పెరుగు అక్కర్లేదంటున్నారు తిరుపతి డైరీ శాస్త్రవేత్తలు. పెరుగుకు ప్రత్యామ్నాయంగా సరికొత్త పౌడర్‌ను తయారు చేశారు. ఇది ప్రయోగ దశలోనే విజయవంతమైంది.

Webdunia
మంగళవారం, 22 మే 2018 (13:48 IST)
సాధారణంగా పాలు తోడుకి పెరుగు తప్పనిసరి. కానీ, ఇకపై పెరుగు అక్కర్లేదంటున్నారు తిరుపతి డైరీ శాస్త్రవేత్తలు. పెరుగుకు ప్రత్యామ్నాయంగా సరికొత్త పౌడర్‌ను తయారు చేశారు. ఇది ప్రయోగ దశలోనే విజయవంతమైంది. దీనికి చేమిరి సాచెట్ అనే పేరు కూడా ఖరారు చేశారు. అతి త్వరలోనే ఈ చేమిరి సాచెట్స్‌కు మార్కెట్‌లోకి రాబోతున్నాయి.
 
ఈ ప్యాకెట్‌ తీసుకొచ్చి గోరువెచ్చని పాలలో వేస్తే చాలు. ఆ పాలు అలా గడ్డకట్టి పెరుగు అయిపోతుంది. అది కూడా జస్ట్ మూడు గంటల్లోనే. మామూలుగా అయితే 6 గంటల సమయం పడుతుంది. కానీ, పెరుగు కావటానికి ఈ రెడీమేడ్ ప్యాకెట్ కలపటం వల్ల 2 గంటల్లోనే పెరుగు తయారవుతుందని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. 
 
ముఖ్యంగా, పాలు పెరుగుగా మారటానికి ల్యాక్టో‌కోకస్ అనే బ్యాక్టీరియా ఉపయోగపడుతుంది. ఈ బ్యాక్టీరియాను పాల నుంచి సేకరించారు. దాన్ని మూడు దశల్లో వేరు చేశారు. దాని నుంచి రెడీమేడ్ తోడును సృష్టించారు. ఇది చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో అందించనున్నారు. ప్రస్తుతం పాలు, పెరుగు ఎక్కడెక్కడ అమ్ముతున్నారో.. ఈ తోడు ప్యాకెట్లు కూడా అక్కడ అందుబాటులో ఉండనున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నేను దెబ్బ కొడితే ఇక లేవడం ఉండదు: రేవంత్ సర్కార్ పైన కేసీఆర్ పంచ్

కాంగ్రెస్ ఎమ్మెల్యేనా మజాకా... వెండితో బెడ్ మంచం... (Video)

వైద్యం వికటించి తండ్రి మృతి.. ప్రశ్నించిన కుమార్తెను కొట్టి చంపేసిన వైద్యుడు.. ఎక్కడ?

మోడీ మాస్టర్ ప్లాన్.. బీజేపీలో వైకాపా విలీనం!!?

మాలీలో ఘోరం.. బంగారు గనిలో దుర్ఘటన - 10 మంది కూలీలు మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్ నిర్మాత వేదరాజు టింబర్ మృతి

తొలి చిత్రానికి సంతకం చేసిన మత్తుకళ్ల మోనాలిసా (Video)

చేసిన షూటింగ్ అంతా డస్ట్ బిన్ లో వేసిన హీరో?

జీవా, అర్జున్ సర్జా - అగత్యా రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్

ప్రభాస్ భారీ యాక్షన్ సీన్స్ క్రియేటివ్ గా ఎలా చేస్తున్నాడో తెలుసా?

తర్వాతి కథనం
Show comments