Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సౌందర్య చిట్కాలు.. ఉప్పు, రోజ్ వాటర్ కలిపి ముఖానికి రాసుకుంటే?

ఒక స్పూన్ ఉప్పులో చెంచా రోజ్ వాటర్ కలిపి, అది కరిగిన వెంటనే ముఖానికి రాసుకోవాలి. మునివేళ్ళతో మెల్లిగా రెండు నిమిషాల పాటు మర్దనా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ చర్మంపై గల మృతకణాలు తగ్గిపోతాయి.

Advertiesment
Beauty
, బుధవారం, 9 మే 2018 (15:47 IST)
సరైన పద్దతులలో, సరైన సౌందర్య చిట్కాలను పాటించడం వలన చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోవచ్చు. సౌందర్య చిట్కాల ద్వారా ప్రకాశవంతమైన చర్మాన్ని పొందవచ్చు. సహజమైన సౌందర్య చిట్కాలను వాడటం వలన మీ ఆరోగ్యానికి, చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది. ఆ చిట్కాలేంటో చూద్దాం.
 
అర చెంచా ముల్తానీ మట్టిలో అరచెంచా పాలపొడి, గులాబీ రేకుల మిశ్రమం, దానిమ్మ రసం చెంచా చొప్పున, చిటికెడు పసుపు కలిపి ముఖానికి వేసుకోవాలి. పది నిమిషాలయ్యాక పాలని కాచి చల్లార్చిన తర్వాత అందులో దూదిని ముంచి ముఖంపై అద్దినట్లు చేయాలి. మర్దన చేస్తూ పూతను తొలగించుకోవాలి. ముఖం ప్రకాశవంతంగా మారుతుంది. 
 
ఒక స్పూన్ ఉప్పులో చెంచా రోజ్ వాటర్ కలిపి, అది కరిగిన వెంటనే ముఖానికి రాసుకోవాలి. మునివేళ్ళతో మెల్లిగా రెండు నిమిషాల పాటు మర్దనా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ చర్మంపై గల మృతకణాలు తగ్గిపోతాయి. 
 
కీరదోసకి చర్మాన్ని మృదువుగా చేసే గుణం ఉంది. చిన్న కీరదోస ముక్కల్ని పేస్టు చేసుకోవాలి. తరువాత అందులో కొన్ని చుక్కలు రోజ్‌వాటర్ కలిపి ముఖానికి రాసుకుని పావుగంట తర్వాత కడిగేసుకుంటే మీ ముఖం అందంగా కనిపిస్తుంది.
 
కోడిగుడ్డులోని తెల్లని సొనను బాగా నురగవచ్చే వరకు కలిపి ఒక స్పూను తేనె, స్పూన్ సన్‌ఫ్లవర్ ఆయిల్ కలిపి ముఖానికి పట్టించాలి. 20 నిమిషాల తరువాత వేడినీళ్లతో కడిగితే చర్మం మృదువుగా తయారవుతుంది. 
 
శెనగపిండిలో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని ఆరాక కడిగేయాలి. ఇలా ప్రతిరోజు చేయడం వల్ల ముఖంపై మచ్చలు తొలగిపోతాయి. స్నానానికి వెళ్లేందుకు ముందుగా పచ్చి పసుపు పాల మీగడ కలిపి ముఖానికి రాసి ఇరవై నిమిషాల తరువాత స్నానం చేస్తుంటే క్రమేణా చర్మం తెల్లబడుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీ చర్మాన్ని నల్లగా మారుస్తుందా? లేదా అది ఒక మూఢనమ్మకమా?