దంతాలు పసుపు పచ్చగా ఉన్నాయా.. అయితే ఇలా చేయండి..?

Webdunia
గురువారం, 22 నవంబరు 2018 (12:48 IST)
చాలామందికి దంతాలు పసుపు పచ్చగా ఉంటాయి. ఆ రంగు తొలగించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా కూడా ఎలాంటి లాభాలు కనిపించవు. మరి బయట షాపుల్లో దొరికే వాటిని వాడుదాం అనుకుంటే.. సమస్య మరింత పెరిగిపోతుంది. కనుక ఇంట్లోని పదార్థాలు ఉపయోగించండి. దంతాల రంగు మారుతుంది. అంతేకాదు.. చిగుళ్లు ఆరోగ్యంగా కూడా ఉంటాయి. ఆ పదార్థాలేంటో చూద్దాం...
  
1. తులసి ఆకుల్నిఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఈ పొడితో ప్రతిరోజూ బ్రష్‌ చేసుకుంటే పళ్లపై వచ్చే పసుపు మరకలు తొలగిపోతాయి. అంతేకాకుండా పళ్లకు సంబంధించిన ఇతర సమస్యలు కూడా పోతాయి.  
 
2. లవంగాలను వేయించి పొడి చేయాలి. ఇందులో కొద్దిగా నిమ్మరసం కలిపి పళ్లు రుద్దుకోవాలి. ఇలా చేయడం వలన పళ్లు తళతళా మెరవడమే కాకుండా బలంగా కూడా ఉంటాయి. 
 
3. బొప్పాయి తొక్కలతో పళ్లు రుద్దుకుంటే దంతాలపై ఏర్పడే ఎటువంటి మచ్చలైనా సులభంగా పోతాయి. అంతేకాకుండా చిగుళ్లు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.
 
4. స్ట్రా‌బెర్రీలను పేస్ట్‌లా చేసి అందులో చిటికెడు వంటసోడా కలుపుకోవాలి. ఈ మిశ్రమంతో పళ్లను రుద్దుకోవాలి. స్ట్రా‌బెర్రీలో ఉండే విటమిన్‌-సి, యాసిడ్‌లు పళ్లకు తెల్లటి రంగు రావడానికి ఉపయోగపడతాయి.
 
5. ఉప్పులో కొన్ని చుక్కలు నిమ్మరసం కలిపి ఈ మిశ్రమంతో పళ్లు రుద్దుకొని కాసేపటి తరువాత కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల పళ్లకుండే పసుపు రంగు పోతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇకపై ఇంటి వద్దే ఆధార్ కార్డులో మొబైల్ నంబర్ అప్‌డేషన్

Laddu Ghee Case: తిరుమల లడ్డూల తయారీకి కల్తీ నెయ్యి.. టీటీడీ ఇంజనీరింగ్ అధికారి అరెస్ట్

ఐఏఎస్ శ్రీలక్ష్మిపై అక్రమాస్తుల కేసును కొట్టేయొద్దు

ఓ ఇంటర్వ్యూ పాత పగను రగిల్చింది... మాజీ నక్సలైట్‌ను హత్య

పాకిస్థాన్‌కు షాకిచ్చిన యూఏఈ.. పాక్ పౌరులకు వీసాలు నిలిపివేత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: గోవా బీచ్‌లో పచ్చ రంగు చీర కట్టుతో కనిపించిన శ్రీలీల

బాలయ్య పవర్ కు అఖండ Roxx వెహికల్ కూడా అంతే పవర్ ఫుల్

బోల్డ్ సన్నివేశాలున్నాయి.. కానీ నగ్నంగా నటించలేదు.. క్లారిటీ ఇచ్చిన ఆండ్రియా

కూలీ ఫట్.. టాలీవుడ్ టాప్ హీరోలు వెనక్కి.. పవన్ మాత్రం లోకేష్‌తో సినిమా చేస్తారా?

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

తర్వాతి కథనం
Show comments