చాలామంది గోర్లు శుభ్రం చేయడానికి బ్యూటీ పార్లర్స్‌కు వెళుతుంటారు. ఈ చిన్ని విషయానికి అక్కడికి వెళ్లి డబ్బులను వృధా చేస్తుంటారు. సరే.. డబ్బులు పోతే పోయాయి కానీ, గోర్లు శుభ్రంగా మారాయని చెప్పలేము. కనుక ఇంట్లోనే గోర్లను ఎలా శుభ్రం చేసుకోవాలో చూద్దాం..
1. నెయిన్ పాలిష్ పెట్టుకునేటప్పుడు ముందుగా గోర్లను గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఆ తరు రిమూవర్‌తో శుభ్రం చేసి పాలిష్ వేయాలి. అప్పుడే గోర్లు చూడడానికి అందంగా, కాంతివంతంగా కనిపిస్తాయి.
2. నెయిల్ రిమూవర్ వాడిన తరువాత గోర్లను ల్యావెండర్ ఆయిల్‌తో తుడుచుకోవాలి. లేదంటే గోర్లు పొడిబారి ఇన్‌ఫెక్షన్స్ ఏర్పడే అవకాశాలున్నాయి.
3. నెయిల్ రిమూవర్ వాడిన తరువాత గోర్లకు పాలిష్ వెంటనే పెట్టకూడదు. అలా చేస్తే చేతులు ముడతలుగా మారుతాయి. రిమూవర్ బదులుగా క్యూటిరక్ క్రీమ్ కూడా వాడొచ్చు.
4. సాధారణంగా రిమూవర్ తేలికగా మంటను ఏర్పరస్తుంది. కనుక సురక్షిత ప్రాంతాల్లో మాత్రమే వాడాలి. చాలామందికి గోర్లలో దురదులు, పుండ్లు ఎక్కువగా వస్తుంటాయి. వాటిని తొలగించాలంటే.. ఇలా చేయాలి.
5. చిటికెడు పసుపులో కొద్దిగా నిమ్మరసం కలిపి గోర్లపై రాసుకోవాలి. ఇలా తరచుగా చేస్తే దురదలు, పుండ్లు వంటి సమస్యలు పోతాయి. ఈ విధంగా గోర్లను శుభ్రం చేసుకుంటే గోర్లు ఆరోగ్యంగా ఉంటాయి.