అందగానే ఉంటారు.. మరీ అందంగా కనిపించాలని భావిస్తుంటారు. అందుకు ముఖానికి రకరకాల క్రీమ్స్, ఫేస్‌ప్యాక్ వాడుతుంటారు.. చెవిపోగులకు ఫ్యాషన్ కమ్మలు ధరిస్తే అందం ఇకొంత రెట్టింపవుతుందని వారి భావన. కానీ, కొంతమంది చెవిపోగులకు ఈ ఫ్యాషన్ కమ్మలు సెట్‌కావు. ఎందుకంటే వారు ఎప్పుడూ బంగారంతో చేసిన ఆభరణాలే ధరించడమే ఇందుకు కారణం.
లోహాలతో చేసిన ఆభరణాలను వేసుకున్నప్పటి నుండి దురద పెట్టడం, చీము కారడం, దాంతో పాటుగా నొప్పి ఏర్పడే అవకాశాలున్నాయి. ఇలాంటి సమస్యల నుండి ఉపశమనం లభించాలంటే.. గోరువెచ్చని కొబ్బరి నూనెను చెవులకు మర్దన చేసుకుని రాత్రంతా అలానే ఉంచాలి. ఉదయాన్నే శుభ్రం చేసుకోవాలి. ఇలా తరుచుగా చేస్తే చెవులు అలర్జీలు తొలగిపోతాయి.
అలానే చెవి తమ్మెకు ధారాళంగా గాలి తగిలేందుకు వీలుగా వుండేవాటిని ధరించాలి. అప్పుడు హ్యంగిగ్స్‌ను ఎంచుకోవాలి. గట్టిగా తమ్మెను పట్టేసినట్లుంటే దురదలు ఏర్పడే ఆభరణాలు ధరించకూడదు. ఎక్కువ బరువైన హంగులతో ఉన్నవి తప్పని పరిస్థితుల్లో పెట్టుకోవలసి వస్తే మాత్రం రెండు గంటలకు మించి పెట్టుకోకూడదు.