ప్రయాణాలలో వాంతులా.. అయితే ఇలా చేయండి..?

Webdunia
బుధవారం, 3 ఏప్రియల్ 2019 (09:45 IST)
చాలామందికి బస్సు ప్రయాణం పడదు. బస్సులో ప్రయాణం చేసేటప్పుడు కడుపులో తిప్పినట్లుగా ఉంటుంది. దీని కారణంగా వాంతులు అవుతుంటాయి. ఎక్కువగా ఘాట్ రోడ్డులో ప్రయాణం చేసేటప్పుడు ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఇలా చాలామందికి వాహనాల ప్రయాణం సమయంలో వాంతులు అవుతుంటాయి. అలాంటి వారు ప్రయాణానికి ముందు కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ సమస్య రాదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 
చిన్న అల్లం ముక్కను బుగ్గ లోపల పెట్టుకుంటే వాంతి వచ్చే అవకాశం చాలా తక్కువ. అల్లంలో క్యాల్షియం, పాస్పరస్, మెగ్నిషియం, ఐరన్, కాపర్, జింక్ వంటి ఖనిజాలు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. వక్కపొడిని చప్పరించినా వాంతి సమస్యనుండి బయట పడవచ్చు. 
 
నిమ్మకాయను కొద్దికొద్దిగా నలుపుతూ ముక్కు దగ్గర పెట్టుకుని వాసన పీలిస్తే కూడా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. లవంగాలు, సోంపు వంటివి దవడలో పెట్టుకుని చప్పరించినా కూడా వాంతులు రాకుండా ఉంటాయి. వాంతులు ఎక్కువగా వచ్చేవారు కారు, బస్సు ఎక్కినప్పుడు ముందు సీట్లో కూర్చుని పరిసరాలను గమనిస్తే ఈ సమస్యను అధిగమించవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇరాన్ అధ్యక్ష భవన్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం

ప్రాజెక్ట్ షైన్ కింద పెద్దపల్లికి హెచ్‌సిసిబి చేయూత

కిలో టమోటా రూ. 4, కానీ మార్కెట్లో రూ. 15, ఏం చేద్దాం?

పెళ్లికి అడ్డు వస్తున్నాడనీ ప్రియుడుని హత్య చేసిన టీవీ నటి

నేపాల్ సరిహద్దుల్లో మనీ డెన్ కీపర్ ప్రణయ్ ప్రకాశ్ అరెస్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డైరెక్షన్ ఇంట్రెస్ట్, మరోవైపు తమిళ్ లో జననాయకన్ కూ అవకాశం వచ్చింది : కొరియోగ్రాఫర్ సుధన్ మాస్టర్

ఓ రాత్రికి రేటెంత? సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేసిన రేణూ దేశాయ్

Srinath Maganti: శోభనం రోజే వాంతి చేసుకుంటే మెన్షన్ హౌస్ మల్లేష్ ఏం చేశాడు?

Heba Patel: సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో రేపు ఉదయం 10 గంటలకు

Rajamouli: ఎస్ ఎస్ రాజమౌళి వారణాసి షెడ్యూల్ అంటార్కిటికాలో - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments