ఈ మధ్య కాలంలో చాలా మందికి మానసిక సమస్యలు వస్తున్నాయి. మానసిక రుగ్మతలలో ఎక్కువ మందిని బాధపెట్టేది ఒత్తిడి. దీని నుండి విముక్తి పొందడానికి ఆసుపత్రుల చుట్టూ తిరిగుతున్నారు. ఒత్తిడి వల్ల ఆతురత, కృంగిపోవడం, చిరాకు వంటి మానసిక లక్షణాలు మాత్రమే వస్తాయనుకుంటే పొరపాటే. వీటితోపాటు తలనొప్పి, అజీర్ణం, బరువు తగ్గడం లేదా పెరగడం, బరువులో అనూహ్య మార్పులు, అలసట మొదలగు భౌతిక లక్షణాలు కూడా కనపడతాయి.
మన ఆయుర్వేదంలో ప్రకృతి సిద్ధంగా ఒత్తిడిని తగ్గించుకునే మార్గాలు ఉన్నాయి. పసుపు, నిమ్మకాయతో ఒత్తిడిని ఎలా దూరం చేసుకోవచ్చో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు పసుపు పొడి ఒక టేబుల్ స్పూన్, తేనె ఒక టేబుల్ స్పూన్ మరియు నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్. ఈ మూడింటినీ ఒక గ్లాసు నీళ్లలో బాగా కలిపి రోజుకొకసారి ప్రతిరోజూ భోజనం చేయక ముందు త్రాగండి.
అంతే మీ ఒత్తిడి మాయమవుతుంది. పనిలో ఒత్తిడి, ఆర్ధిక సమస్యలు, సంబంధ బాంధవ్యాల సమస్యలు, మానసిక సంక్షోభం, అయోమయం, ఆరోగ్య సమస్యల గురించి ఆందోళన పడటం ఇలా మొదలగు కారణాల వల్ల కలిగే తీవ్ర ఒత్తిడుల నుండి కూడా తప్పించుకోవచ్చు. ఒత్తిళ్ల వల్ల కలిగే క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు మరియు వంధ్యత్వం నుండి ఉపశమనం పొందవచ్చు.
చాలామంది డిప్రెషన్ తగ్గించుకోవడానికి మద్యం సేవించడం, పొగత్రాగటం, మందులు తీసుకోవడం చేస్తుంటారు. వీటి వలన ఆరోగ్యం క్షీణిస్తుంది. సహజ సిద్ధమైన మందులే చాలా మంచివి. పసుపు శరీరంలో ఉన్న కణాలకు శక్తిని ఇచ్చి పోషిస్తాయి మరియు వ్యాధులపై పోరాడటానికి ఎంతగానో సహాయపడతాయి. పసుపులో ఉండే ప్రతిక్షకారిని మెదడులో ఉండే కణాలను పోషిస్తుంది.
ఇంకా ప్రాణవాయువుతో కూడిన రక్తం మెదడుకి అందించడంలో సహాయపడుతుంది. దీనివల్ల ఒత్తిడి చాలా త్వరగా తగ్గుతుంది. నిమ్మరసం, తేనెలలో కూడా ప్రతిక్షకారినిలు ఉంటాయి. నిమ్మరసంలో ఉండే విటమిన్ సి శరీరంలో ఉండే కార్టిసోల్ స్థాయిలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీని వల్ల ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది. దీనితోపాటు ధ్యానం యోగా కూడా చేయండి.