Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరటిపండులో జీలకర్ర పొడి కలిపి తింటే..?

Webdunia
మంగళవారం, 26 మార్చి 2019 (13:24 IST)
జీలకర్ర యాంటీ సెప్టిక్ లక్షణాలను కలిగి వుండడం వలన జలుబును కలుగజేసే కారకాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఒక కప్పు కాచిన నీటిలో జీలకర్ర, అల్లం, తేనె, తులసి ఆకులు కలుపుకొని తాగడం వలన జలుబు నుండి ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 
జీలకర్ర యాంటీ ఏజింగ్‌గా పనిచేసి చర్మంపై ముడతలు రాకుండా నివారిస్తుంది. ఇందుకు జీలకర్రలో విటమిన్‌ ఇ ఎక్కువగా ఉండడమే కారణం. జీలకర్రలో ఎక్కువగా ఫైబర్‌, యాంటీ ఫంగల్‌, లాక్సైటీవ్స్‌, కార్మినేటివ్‌ గుణాలు ఉన్నాయి. ఇవి మొలలు నుంచి ఉపశమనం కలిగించడానికి సహాయపడుతాయి.
 
జీలకర్ర కాలేయంలో పైత్యరసం తయారవటాన్ని ప్రోత్సహిస్తుంది. దీనివలన జీర్ణక్రియ పనితీరు మెరుగుపడుతుంది. రోజువారి ఆహారంలో జీలకర్ర తీసుకోవడం వలన రక్తంలోని షుగర్‌ లెవెల్స్ తగ్గుతాయి. దీనివలన మధుమేహం అదుపులో ఉంటుంది. జీలకర్రలో క్యాల్షియం, ఫాస్ఫరస్‌, ఐరన్‌, సోడియం, పొటాషియం, విటమిన్‌ ఎ, సి ఎక్కువగా ఉన్నాయి. జీలకర్రలో ఐరన్‌ పుష్కలంగా లభించడం వలన రక్తంలో హిమోగ్లోబిన్‌ తయారవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
 
జీలకర్ర కడుపు నొప్పి, విరోచనాలు, అలసటను, అజీర్ణం వంటి వాటిని తగ్గిస్తుంది. కొత్తిమీరలో జీలకర్ర పొడి, ఉప్పు వేసి కలిపి తాగితే జీర్ణ శక్తి పెంపొందిస్తుంది. శరీరంలోని అనవసరపు కొవ్వుని కరిగిస్తుంది. షుగర్ వ్యాధిని నివారిస్తుంది. అరటి పండును తీసుకుని దాన్ని బాగా నలిపి దాంట్లో జీలకర్ర పొడిని కలిపి తింటే హాయిగా నిద్రవస్తుంది. అధిక బరువు తగ్గుతారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తిరుమల పరిధిలో చికెన్ బిర్యానీ హోటల్... వార్తల్లో నిజమెంత?

Father: ఎనిమిది నెలల కొడుకును హత్య చేసి.. భార్యపై దాడి చేశాడు.. అంతా అనుమానం..

కూకట్‌పల్లి మహిళ హత్య.. చిత్రహింసలు పెట్టి... కుక్కర్‌‍తో కొట్టి.. గొంతుకోసి....

నా కుమారుడే వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుడు : వైఎస్ షర్మిల

అమెరికాలో భారత సంతతి వ్యక్తి తల తెగ నరికేశారు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jabardasth Comedian: వైల్డ్ కార్డ్ ఎంట్రీ- బిగ్‌బాస్ జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది

ఫిల్మ్‌ఫేర్ గ్లామర్- స్టైల్ అవార్డ్స్ 2025తో బ్లెండర్స్ ప్రైడ్

Emraan Hashmi: పవన్ కళ్యాణ్ ఓజీ నుండి థమన్ స్వరపరిచిన ఓమి ట్రాన్స్ విడుదల

Tej sajja: చిరంజీవి, కరణ్ జోహార్, నాని గారి కాంప్లిమెంట్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది : తేజ సజ్జా

Shiva Kandukuri: చాయ్ వాలా మొదటి సింగిల్ సఖిరే లిరికల్ విడుదలైంది

తర్వాతి కథనం
Show comments