Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భోజనాంతరం బెల్లం తింటే..?

భోజనాంతరం బెల్లం తింటే..?
, మంగళవారం, 26 మార్చి 2019 (10:20 IST)
చాలామంది తరచు మధుమేహ వ్యాధితో బాధపడుతుంటారు. అలాంటప్పుడు చక్కరెతో తయారుచేసిన పదార్థాలు తినడం ఆరోగ్యానికి మంచిదికాదని నిపుణులు సూచిస్తున్నారు. కనుక.. చక్కెరకు బదులుగా బెల్లం తీసుకుంటే ఫలితం ఉంటుంది. బెల్లంలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీనిలో రసాయనాలు కూడా ఎక్కువే. అలానే మీరు ఎంపిక చేసే బెల్లం ముదురు రంగు ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే.. ఈ బెల్లంలోనే కల్తీ ఉండదు.
 
బెల్లం తీసుకోవడం వలన శరీరంలోని విషపదార్థాలన్ని బయటకు పోతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. దాంతోపాటు కాలేయాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. బెల్లంలో ఐరన్, ఫోలిక్ ఆమ్లాలు అధిక మోతాదులో ఉన్నాయి. ఇవి ఎర్రరక్త కణాల సంఖ్య తగ్గిపోకుండా చేస్తాయా. దాంతో రక్తహీనత సమస్య వచ్చే ముప్పును నివారించవచ్చును. నిద్రలేమిని కూడా తొలగిస్తుంది.
 
కీళ్ల నొప్పులతో బాధపడేవారు బెల్లాన్ని పాలలో కలిపి తీసుకుంటే నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. అలానే ఎముకలు పటుత్వానికి ఎంతగానో దోహదపడుతాయి. వేడి నీళ్ళల్లో కొద్దిగా బెల్లం కలిపి తాగితే దగ్గు, జలుబు వంటి సమస్యలు దరిచేరవు. టీలో చక్కెరకు బదులుగా బెల్లం వేసుకుని తాగితే మంచిది. భోజనం చేసిన తర్వాత కొద్దిగా బెల్లం తింటే ఆహారం తొందరగా జీర్ణమవుతుంది.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంతకముందులా శృంగారంలో పాల్గొనలేకపోతున్నారా? ఇవి తీసుకుంటే సరి...