Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యాబేజీ పేస్ట్, కొబ్బరి నూనెతో కీళ్లనొప్పులు తగ్గుతాయా..?

Webdunia
శనివారం, 3 నవంబరు 2018 (14:00 IST)
క్యాబేజీని ఆకుకూర అని కూడా అంటారు. మరి క్యాబేజీలోని ఆరోగ్య ప్రయోజనాలేంటే.. ఇందులో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. పోషక విలువలు అధికంగా ఉంటాయి. క్యాబేజీలోని పీచు పదార్థాలు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా నాడీ వ్యవస్థ బాగా పనిచేసేలా ఉపయోగపడుతుంది. క్యాబేజీలో సూక్ష్మ పోషక పదార్థాలతో పాటు విటమిన్ ఎ, బి, సి వంటివి కూడా ఉన్నాయి.
 
కీళ్లనొప్పులుగా ఉన్నప్పుడు క్యాబేజీలు పేస్ట్‌లా తయారుచేసుకుని అందులో కొద్దిగా కొబ్బరి నూనె కలిపి మర్దన చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి. సాధారణంగా కొంతమందికి రక్తప్రసరణ సరిగ్గా జరగదు. ఎందుకంటే.. తినే ఆహార పదార్థాల్లో విటమిన్ కె లేకపోవడమే అందుకు కారణం. అందుకు క్యాబేజీ మంచి టానిక్‌లా ఉపయోగపడుతుంది. 
 
క్యాబేజీలో కొద్దిగా కందిపప్పు, ఉప్పు, కారం, పచ్చిమిర్చి వేసి కాసేపు ఉడికించి తీసుకుంటే కంటి చూపు సమస్యలు రావు. దాంతో పాటు కంటి కిందటి నల్లటి వలయాలు కూడా తొలగిపోతాయి. దీనిలోని విటమిన్ సి క్యాన్సర్ వ్యాధుల నుండి కాపాడుతుంది. రక్తపోటును తగ్గిస్తుంది. ఎముకలు బలంగా ఉండాలంటే.. ప్రతిరోజూ క్యాబేజీ జ్యూస్ తీసుకుంటే మంచిది. 
 
క్యాబేజీలోని సల్ఫర్, సిలికాన్ వెంట్రుకలు రాలకూండా చేస్తాయి. అందువలన క్యాబేజీని పేస్ట్‌లా చేసి అందులో కొద్దిగా శెనగపిండి, పెరుగు, మెంతి పొడి కలిపి తలకు రాసుకోవాలి. గంట పాటు అలానే ఉంచుకుని ఆ తరువాత తలస్నానం చేయాలి. ఇలా తరచుగా చేయడం వలన జుట్టు రాలే సమస్య తొలగిపోతుంది. దాంతో తెల్లకలు కూడా రావు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments