Webdunia - Bharat's app for daily news and videos

Install App

పర్సనల్ కంప్యూటర్ పితామహుడు ఆర్నాల్డ్ స్పీల్ బర్గ్ ఇకలేరు

Webdunia
శుక్రవారం, 28 ఆగస్టు 2020 (14:15 IST)
ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్ తండ్రి, పర్సనల్ కంప్యూటర్ పితామహుడు, టెక్నాలజీ రంగ నిపుణుడుగా గుర్తింపు పొందిన ఆర్నాల్డ్ స్పీల్ బర్గ్ ఇకలేరు. ఆయన 103 యేళ్ల వయస్సులో వద్ధాప్య సమస్యల కారణంగా కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. తన తండ్రి 103 యేళ్ల వయస్సులో ప్రశాంతంగా కన్నుమూశారని స్టీవెన్ స్పీల్ బర్గ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
 
కాగా, 1970, 1980 దశకాల్లో పీసీలు అందుబాటులోకి వచ్చాయంటే, 1950లో ఆర్నాల్డ్ చేసిన కృషే కారణమని చెప్పొచ్చు. జనరల్ ఎలక్ట్రిక్ సంస్థలో పనిచేస్తూ, సహోద్యోగి అయిన ప్రాప్‌ స్టర్‌తో కలిసి 'స్పీల్ బర్గ్ జీఈ-225' అనే మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్‌ను తయారు చేశారు. 
 
ఈ స్ఫూర్తితోనే 'బేసిక్' ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని డార్ట్ మౌత్ కాలేజ్ పరిశోధకులు తయారు చేశారు. ఈ లాంగేజ్వ్ సాయంతోనే ఆపై కంప్యూటర్లు తయారు అయ్యాయి. 1917లో జన్మించిన ఆయన, తన సుదీర్ఘ జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలను చవిచూశారు. యూఎస్‌లోని సిన్సినాటి ప్రాంతానికి వలస వచ్చిన ఉక్రెయిన్‌కు చెందిన యూదు దంపతులకు ఆర్నాల్డ్ జన్మించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments