Webdunia - Bharat's app for daily news and videos

Install App

అతడు రేప్ చేస్తుంటే చచ్చినట్లు పడిపోయా... అదో వరెస్ట్ అనుభవం... నటి

పాపులర్ హాలీవుడ్ నిర్మాత వైన్‌స్టీన్ రాసలీలల వ్యవహారంపై రోజుకో నటి ఫిర్యాదు చేస్తూ వస్తోంది. తాజాగా ఈ జాబితాలో మరో నటి చేరింది. హాలీవుడ్ నటి నటాసియా మాల్తే తనపై జరిగిన లైంగిక దాడిపై బుధవారం నాడు మీడియాతో పూసగుచ్చినట్లు చెప్పింది. 2008 ఫిబ్రవరి నెలలో

Webdunia
గురువారం, 26 అక్టోబరు 2017 (17:55 IST)
పాపులర్ హాలీవుడ్ నిర్మాత వైన్‌స్టీన్ రాసలీలల వ్యవహారంపై రోజుకో నటి ఫిర్యాదు చేస్తూ వస్తోంది. తాజాగా ఈ జాబితాలో మరో నటి చేరింది. హాలీవుడ్ నటి నటాసియా మాల్తే తనపై జరిగిన లైంగిక దాడిపై బుధవారం నాడు మీడియాతో పూసగుచ్చినట్లు చెప్పింది. 2008 ఫిబ్రవరి నెలలో హార్వే వైన్‌స్టీన్ తనను బలవంతంగా అనుభవించాడనీ, తను ఎంత ప్రతిఘటించినా తనపై అత్యాచారం చేశాడని వెల్లడించింది. 
 
లండన్ హోటల్ గదికి తనను రమ్మని పిలిచాడనీ, తన పాత్ర గురించి చర్చిస్తానంటూ చెప్పి ఆ గదిలో తనను పొద్దుపోయే వరకూ వుండేట్లు చేశాడని వెల్లడించింది. ఆ తర్వాత కొద్దిసేపటికి దుస్తులు తీసేసి తన కోర్కె తీర్చాలంటూ ఒత్తిడి చేసినట్లు చెప్పుకొచ్చింది. తనకు ఇలాంటివి ఇష్టం లేదని చెప్పినప్పటికీ, తనతో అలా గడిపిన వారంతా నెంబర్ వన్ స్థానంలో వెలిగిపోతున్నారనీ తనపై అఘాయిత్యం చేశాడని తెలిపింది. 
 
ఆ సమయంలో అతడు డ్రగ్స్ తీసుకున్నట్లుగా అనిపించనీ, తను ఎంత వారించినా ఫలితం లేకుండా పోయిందనీ, దీంతో అతడు తనపై అత్యాచారం చేస్తుంటే జీవచ్చవంలా అలా వుండిపోవాల్సి వచ్చిందని వాపోయింది. హాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చాలామంది పురుషుల చేతిలో ఇలాంటి దాడులను ఎదుర్కోవలసి వచ్చిందనీ, కానీ హార్వేతో అదో భయంకరమైన అనుభవమని వెల్లడించింది. 
 
నార్వే నుంచి ఎన్నో కలలు కంటూ సినీ ఇండస్ట్రీకి వచ్చాననీ, కానీ తన కలలన్నీ కల్లలయ్యాయనీ, సినిమా పరిశ్రమలో వున్న వాతావరణం చూసి తల్లడిల్లిపోయినట్లు చెప్పుకొచ్చింది. సినిమాల్లో అవకాశాల కోసం వచ్చే అమ్మాయిలను ఇక్కడి నిర్మాతల్లో కొందరు ఎంతమాత్రం విడిచిపెట్టరనీ, అదో జాడ్యంలా పాకిపోయి వున్నట్లు ఆమె చెప్పింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

"ఈగల్" బృందం ఏర్పాటు.. గంజాయి విక్రయిస్తే అంతే సంగతులు

మోడీ నా‌పై‌ చూపే అభిమానం.. ఆప్యాయత ఎంతో విలువైనది...

ఆపరేషన్‌ బుడమేరు: విజయవాడను వరద ముంపు నుంచి తప్పించే ఈ ప్రాజెక్ట్ ఎప్పటికి పూర్తవుతుంది, ఆక్రమణల మాటేంటి?

మహారాష్ట్ర సీఎం అభ్యర్థిపై ఎంపికపై వీడని ఉత్కంఠ - హస్తినకు ఆ ముగ్గురు నేతలు

మెట్టు దిగిన ఏక్‌నాథ్ షిండే.. బీజేపీ అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం