Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అక్కడెందుకు నొక్కావన్న హీరోయిన్... నాకది అలవాటేనన్న ప్రొడ్యూసర్...

సినీ ఇండస్ట్రీ అనగానే చాలామంది అనుకునే మాట హీరోయిన్లలో కొందరిపై అఘాయిత్యాలు జరుగుతుంటాయని. ఇది నిజమేనంటూ కొందరు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ హీరోయిన్లు ఇప్పటికే బహిరంగంగా చెప్పేశారు కూడా. మన ఇండస్ట్రీల్లోనే పరిస్థితి ఇలావుంటే ఇక హాలీవుడ్ ఇండస్ట్రీలో

Advertiesment
అక్కడెందుకు నొక్కావన్న హీరోయిన్... నాకది అలవాటేనన్న ప్రొడ్యూసర్...
, సోమవారం, 16 అక్టోబరు 2017 (14:07 IST)
సినీ ఇండస్ట్రీ అనగానే చాలామంది అనుకునే మాట హీరోయిన్లలో కొందరిపై అఘాయిత్యాలు జరుగుతుంటాయని. ఇది నిజమేనంటూ కొందరు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ హీరోయిన్లు ఇప్పటికే బహిరంగంగా చెప్పేశారు కూడా. మన ఇండస్ట్రీల్లోనే పరిస్థితి ఇలావుంటే ఇక హాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ వ్యవహారం ఇంకెలా వుంటుందో వూహించుకోవచ్చు. హాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పేరు మోసిన నిర్మాత హార్వే వీన్ స్టీన్ తన వద్దకు ఛాన్సుల కోసం వచ్చిన 34 మంది హీరోయిన్లపై అత్యాచారం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 
 
తన సినిమాల్లో ఛాన్సులు కావాలంటే తనకు ఆ సుఖం ఇవ్వాల్సిందేనంటూ అతడు ఓ నటితో మాట్లాడిన ఆడియో టేప్ ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. హీరోయిన్లే కాదు తన సంస్థలో పనిచేసే మహిళల్లో పలువురిపై ఈ నిర్మాత లైంగికంగా వేధింపులకు గురి చేయడమే కాకుండా వారిపై అత్యాచారం చేసినట్లుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి. సదరు నిర్మాత కామ కోర్కెకి భీతిల్లిపోయిన ఓ హీరోయిన్ పెట్టిన కేసుతో నిర్మాతపై రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తోంది. ఇటీవలే ఓ మోడల్ తనకు సినిమా అవకాశం ఇస్తానని చెప్పడంతో ఆమె అతడి వద్దకు వచ్చింది. 
 
ఆమెతో అతడు మాట్లాడిన తీరు చాలా దారుణంగా వున్నది. ఆ ఆడియో టేపును న్యూయార్క్ టైమ్స్ బయటపెట్టింది. ఆ ఆడియో టేపులో సదరు యువతిని నిర్మాత తన గదికి రావాలని, 5 నిమిషాలు చాలంటూ ఆమెను బలవంతపెడుతున్నట్లు తెలుస్తుంది. గదిలోకి వస్తే నీ కెరీర్ మారిపోతుందని అతడంటే... తను అలాంటిదాన్ని కాదని ఆమె వాదిస్తోంది. ఈ సంభాషణలో యువతి ‘అసలు నువ్వు నిన్న నా ఎదను ఎందుకు తాకావు, ఎందుకు నొక్కాలని ప్రయత్నించావు. 
 
నేను షాకయ్యాను.. దయచేసి నన్నేమీ చేయకు’ అంటూ ఆమె ఆవేదనతో కూడిన స్వరంతో అంటోంది. ఇతడు మాత్రం తనకిలాంటివి అలవాటే అని బదులిచ్చాడు. అంతేకాకుండా... నువ్వు దానికి ఒప్పుకోనట్లయితే ఇక తనను కాంటాక్ట్ చేయవద్దని కూడా చెప్పేయడం వినిపిస్తుంది. ఐతే ఈ ఆడియో టేపుల్ని ట్రాష్ అని సదరు నిర్మాత కొట్టి పడేస్తున్నట్లు సమాచారం. ఐతే ఈ వ్యవహారం మాత్రం హాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దుమారం రేపుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వంద జన్మలెత్తినా.. నా భర్తగా నిన్నే కోరుకుంటా.. మంచి తండ్రివి అవుతావు: సమంత (వీడియో)