కంగనా రనౌత్ మణికర్ణిక ఎంతవరకు వచ్చింది?
చారిత్రక నేపథ్యం కలిగిన వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత చరిత్ర ఆధారంగా 'మణికర్ణిక' రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. కంగనా రనౌత్ ఇందులో టైటిల్ రోల్ పోషిస్తోంది. ఈ సినిమా కోసం కంగనా కఠోర శిక్షణ తీస
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఓ వైపు సినీ రంగంలోని లోతుపాట్లను వేలెత్తి చూపుతూ.. మరోవైపు తన పని తాను చేసుకుంటూ పోతోంది. బాలీవుడ్‌లో మహిళలకు ఉన్న మర్యాద ఏంటి? పురుషులకు, స్త్రీలకు దర్శకనిర్మాతలు ఎలాంటి గౌరవం ఇస్తున్నారనే విషయాన్ని కళ్లకు కట్టినట్లుగా దివా సాంగ్ ద్వారా వెల్లడించిన కంగనా రనౌత్... తాజాగా మణికర్ణిక సినిమా ద్వారా బిజీ అయిపోయింది. సిమ్రాన్ సినిమా ప్రమోషన్ పూర్తి చేసుకున్న ఈ భామ గౌతమీ పుత్ర శాతకర్ణి వంటి చారిత్రక చిత్రాన్ని తెరకెక్కించి శభాష్ అనిపించుకున్న క్రిష్‌తో మణికర్ణిక చేస్తోంది.
చారిత్రక నేపథ్యం కలిగిన వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత చరిత్ర ఆధారంగా 'మణికర్ణిక' రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. కంగనా రనౌత్ ఇందులో టైటిల్ రోల్ పోషిస్తోంది. ఈ సినిమా కోసం కంగనా కఠోర శిక్షణ తీసుకుంటోంది. ఇందులోని యుద్ధ సన్నివేశాల కోసం హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ 'నిక్ పావెల్'ను ఎంపిక చేసుకున్నారు.
బ్రేవ్ హార్ట్, గ్లాడియేటర్ వంటి చిత్రాలకు పనిచేసిన ఇతడు మణికర్ణికలోని యుద్ధ సన్నివేశాలను సహజసిద్ధంగా వుండేలా తెరెకెక్కించనున్నట్లు సినీ యూనిట్ వర్గాల సమాచారం. మణికర్ణిక కోసం పావెల్ కంగనాతో పాటు 300 మంది లోకల్ ఫైటర్స్‌కి శిక్షణ ఇచ్చాడని తెలిసింది. ఇందులో అతుల్ కుల్ కర్ణి కీలక పాత్రలో కనిపిస్తాడని సమాచారం.