Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ త‌ర్వాత తొలి 3డి హాలీవుడ్ సినిమా

Webdunia
సోమవారం, 25 జనవరి 2021 (17:29 IST)
Monster Hunter,tonijaa
కోవిడ్ త‌ర్వాత తొలి 3డి హాలీవుడ్ సినిమా రాబోతుంది. సినిమా థియేటర్లు తెరుచుకుని మళ్లీ ప్రేక్షకులతో హాళ్లు కళకళలాడుతున్నాయి. ఈ స‌మ‌యంలో మరింత వినోదాన్ని పంచేందుకు తెరపైకి రాబోతోంది హాలీవుడ్ ఫిలిం "మాన్ స్టర్ హంటర్". ఇంగ్లీష్తో పాటు మూడు భారతీయ భాషలు హింది, తమిళ్, తెలుగులో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఫిబ్రవరి 5న "మాన్ స్టర్ హంటర్" చిత్రాన్ని రిలీజ్ చేస్తున్న‌ట్లు పంపిణీ దారులు సోనీ పిక్చర్స్ తెలిపింది. పోస్ట్ కొవిడ్ థియేటర్ రిలీజ్లో వస్తున్న తొలి త్రీడీ చిత్రం ఇదే కావడం విశేషం. ఐమాక్స్, త్రీడీ ఫార్మేట్ లో "మాన్ స్టర్ హంటర్" విడుదలకు సిద్ధమవుతోంది.
 
ప్రఖ్యాత వీడియో గేమ్ "మాన్ స్టర్ హంటర్" ఆధారంగా ఈ సినిమాను అదే పేరుతో రూపొందించారు దర్శకుడు పాల్ డబ్ల్యూఎస్ అండర్సన్. మిలా జొవోవిచ్, టోనీ జా ప్రధాన పాత్రల్లో నటించిన "మాన్ స్టర్ హంటర్" చిత్రంలో క్లిఫోర్డ్ టీఐ హ్యారిస్, జూనియర్ మీగాన్ గుడ్, డియాగో బోనెట, జోష్ హెల్ మ్యాన్, జిన్ ఉ యూంగ్ మెక్ జిన్, రాన్ పెర్ల్ మ్యాన్ ఇతర క్యారెక్టర్స్ లో కనిపించనున్నారు. అత్యంత శక్తివంతమైన, ప్రమాదకరమైన మాన్ స్టర్స్ ను ఎదుర్కొనేందుకు ఇద్దరు వీరులు చేసిన పోరాటమే ఈ చిత్ర కథ.
 
"మాన్ స్టర్ హంటర్" సినిమా గురించి సోనీ పిక్చర్స్ మేనేజింగ్ డైరక్టర్ 'వివేక్ కృష్ణాని' మాట్లాడుతూ..."మాన్ స్టర్ హంటర్ విజువల్ వండర్గా తెరకెక్కిన సినిమా. ఇలాంటి చిత్రాలను తెరపైనే చూడాలి. త్రీడీ సాంకేతికత ప్రేక్షకులకు మరింత సినిమాటిక్ ఎక్సీపిరియన్స్ ఇస్తుంది. ఇండియా అంతటా మా ఎగ్జిబిటర్స్ థియేటర్లలో అన్ని జాగ్రత్తలు తీసుకుని ప్రదర్శనకు సిద్ధమవుతున్నారు. మాన్ స్టర్ హంటర్ చిత్రాన్ని ఫిబ్రవరి 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం సంతోషంగా ఉంది." అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గూఢచర్య నెట్‌వర్క్‌పై ఉక్కుపాదం.. ఇప్పటికే 12 మంది అరెస్టు

భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా 164 నమోదు

Selfi: ఎంత ధైర్యం.. ఆడ చిరుతలతో సెల్ఫీలు వీడియో తీసుకున్నాడా? (video)

బైటకు రావద్దు తలాహ్ సయీద్, నిన్నూ లేపేయొచ్చు: పాక్ ఆర్మీ, ఐఎస్ఐ వార్నింగ్

China: సింధు జలాల నిలిపివేత.. పాకిస్థాన్‌లో ఆ పనులను మొదలెట్టిన చైనా.. ఏంటది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments