Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయిప‌ల్ల‌వి ప్లేస్‌లో పూజాహెగ్డే!

Webdunia
సోమవారం, 25 జనవరి 2021 (17:16 IST)
మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న తాజా చిత్రం ~ఆచార్య‌`. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోంది. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది, ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్ర చిత్రీకరణ కోసం రామ్ చరణ్ కూడా చేరారు. ఈ చిత్రంలో ఇప్ప‌టికే కాజల్ అగర్వాల్  న‌టిస్తోంది.  ఇటీవ‌లే ఒక ఇంటర్వ్యూలో `ఇది కమర్షియల్ ఎంటర్టైనర్ అవుతుందనీ,  చాలా కాలం తర్వాత తాను మంచి పాత్రను పోషిస్తున్నాన‌ని` కాజ‌ల్‌ వెల్లడించారు.  కాగా, ఇటీవ‌లే చిరంజీవి ఈ చిత్రం షూట్ కోసం నిర్మించిన భారీ ఆలయ సెట్ స్నీక్ పీక్ను పంచుకున్నారు, ఇది అభిమానుల ఆనందాన్ని కలిగించింది.
ఇప్పుడు, సంచలనం ఏమిటంటే, ఈ చిత్రంలో కీలక పాత్ర కోసం పూజా హెగ్డేను సంప్రదించార‌నీ, ఆమె వారంలో షూటింగ్‌లో చేరవచ్చు అని వార్త‌లు వ‌స్తున్నాయి. దీనిపై చిత్ర బృందం ఇంకా అధికారిక ప్రకటన చేయకపోగా, సాయి పల్లవి గతంలో తిరస్కరించిన పాత్ర కోసం ఆమెను సంప్రదించినట్లు తెలుస్తోంది.  ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన ఆమె నటించనుందని స‌మాచారం. రామ్ చరణ్ సిద్ధ అనే పాత్రను పోషిస్తున్నాడు. గ‌ద్దెల‌కొండ‌ గణేష్ సినిమాలో శ్రీదేవి లాగా ఆమె ఈ చిత్రంలో విలేజ్ అమ్మాయి పాత్ర పోషిస్తుందని ఫిలింన‌గ‌ర్ క‌థ‌నాలు చెబుతున్నాయి. కాగా,  ప్ర‌స్తుతం రాధా కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో పాన్-ఇండియా చిత్రం `రాధే శ్యామ్‌`లో పూజా న‌టిస్తోంది. ఇక బొమ్మరిల్లు భాస్కర్ చేస్తున్న `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్`లో న‌టించింది. ఏది ఏమైనా త్వ‌ర‌లో ఆచార్య గురించి ఆమె వివ‌రాలు తెలియ‌నున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏఐ ఫర్ ఆంధ్రా పోలీస్ హ్యాకథాన్-2025లో రెండో స్థానంలో నిల్చిన క్వాడ్రిక్ ఐటీ

దేవుడు అన్నీ చూస్తున్నాడు... దేవుడు శిక్షిస్తాడు : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆగ్రహం

శ్రీలంకలో భారతీయ మైస్ కార్యకలాపాలు విస్తృతం: హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో శ్రీలంక టూరిజం ప్రోగ్రాం

సీఎం సిద్ధరామయ్యకు ఉద్వాసన : కర్నాకటకలో రాజకీయ గందరగోళం!!

దేశ చరిత్రలో తొలిసారి : సుప్రీంకోర్టు ఉద్యోగాల్లో ఎస్సీఎస్టీలకు రిజర్వేషన్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments