Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తీక మాసంలో వనభోజనం చేస్తే ఫలితం ఏమిటి?(వీడియో)

కార్తీక మాసంలో శుక్ల పక్షంలో వనభోజనం చేసినవాడు పాపవిముక్తుడై వైకుంఠవాసుడవుతాడు. వనభోజనం కూడా ఓ పద్ధతి ప్రకారం చేయాలి. పలు జాతుల చెట్లతో వున్న తోటలో ఉసిరిచెట్టు క్రింద సాలగ్రామం వుంచి హరిచందన ఫలపుష్పాదులతో పూజ చేసి యథాశక్తిగా బ్రాహ్మణ పూజ చేసి వారితో

Webdunia
గురువారం, 2 నవంబరు 2017 (21:22 IST)
కార్తీక మాసంలో శుక్ల పక్షంలో వనభోజనం చేసినవాడు పాపవిముక్తుడై వైకుంఠవాసుడవుతాడు. వనభోజనం కూడా ఓ పద్ధతి ప్రకారం చేయాలి. పలు జాతుల చెట్లతో వున్న తోటలో ఉసిరిచెట్టు క్రింద సాలగ్రామం వుంచి హరిచందన ఫలపుష్పాదులతో పూజ చేసి యథాశక్తిగా బ్రాహ్మణ పూజ చేసి వారితో సహా ఆ తోటలో భుజించాలి. అలా చేసినట్లయితే పూజ సమయంలోగాని, జపహోమ కాలాలలో కానీ, భోజన సమయంలోగానీ చండాలాదుల సంభాషణ విన్నందువల్ల వచ్చిన దోషం పోతుంది. వైకుంఠ నివాసం కలుగుతుంది.
 
ఇంకా కార్తీక వ్రతం చేసేవారికి సర్వపాపాలు తొలగుతాయి. కార్తీక మాసంలో విష్ణు సన్నిధిని భగవద్గీత పఠించిన వారి పాపాలు పటాపంచలవుతాయి. కార్తీక మాసంలో మహావిష్ణువును తులసీ దళాలతో, తెలుపు నలుపు గన్నేరు పూలతో అలంకరించిన వారికి పాపాలు పోయి వైకుంఠవాసం కలుగుతుంది. 
 
ఈ మాసంలో శ్రీవారి సన్నిధానమున భగవద్గీతలోని విభూతియోగ, విశ్వరూప దర్శన యోగాలను, భక్తియోగమును భక్తిశ్రద్ధలతో పారాయణ చేసేవారు విష్ణు సాయుజ్యం పొందుతారు. అలాగే విష్ణువు ముందు కార్తీక పురాణములోని ఒక శ్లోకం కానీ, ఒక శ్లోకం పాదం కానీ భక్తితో చదివిన వారికి సర్వపాప విముక్తి కలుగుతుంది. కపిలతీర్థంలో కార్తీక మాసం పూజ వీడియో చూడండి... 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మెట్టు దిగిన ఏక్‌నాథ్ షిండే.. బీజేపీ అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం

హిందూ - ముస్లింల మధ్య చిచ్చు పెట్టడానికి బీజేపీ కుట్ర : రాహుల్ గాంధీ

ప్రధానితో పవన్ కల్యాణ్ భేటీ.. పార్లమెంట్ సమావేశాల మధ్య...?

'ఆర్ఆర్ఆర్‌'పై థర్డ్ డిగ్రీ ప్రయోగం... కటకటాల వెనక్కి సీఐడీ మాజీ ఏఎస్పీ

ఆటో నడుస్తుండగానే రిపీర్ చేశాడు.. వీడియో వైరల్ (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

టిటిడికి రూ. 2.02 కోట్లు విరాళం కానుకగా ఇచ్చిన చెన్నైకి చెందిన భక్తుడు

జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠద్వార దర్శనాలు : తితిదే వెల్లడి

26-11-2024 మంగళవారం ఫలితాలు - మీ శ్రీమతి ధోరణి చికాకుపరుస్తుంది...

2025.. బాబా వంగా జ్యోతిష్యం.. ఆ ఐదు రాశులకు అదృష్టమే..

2025: మిథునరాశి విద్యారంగంలో ఏ మేరకు రాణిస్తుంది?

తర్వాతి కథనం
Show comments