Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ విశ్వాన్నే మీలోకి డౌన్‌లోడ్ చేసే యోగాసనం... మంచు లక్ష్మి యోగా(Video)

హఠ యోగాతో అద్భుత ప్రయోజనాలున్నాయి. చాలామంది కేవలం ఆరోగ్యం, ఫిట్‌నెస్‌లనే హఠ యోగా ప్రయోజనాలుగా భావిస్తుంటారు. అయితే, సద్గురు హఠ యోగా వల్ల శారీరకంగా పలు ప్రయోజనాలు లభించినా, అవన్నీ కేవలం సైడ్ ఎఫెక్టులు మాత్రమే అని చెబుతున్నారు. మానవుని పూర్తి సామర్ధ్య

Webdunia
బుధవారం, 20 జూన్ 2018 (19:22 IST)
హఠ యోగాతో అద్భుత ప్రయోజనాలున్నాయి. చాలామంది కేవలం ఆరోగ్యం, ఫిట్‌నెస్‌లనే హఠ యోగా ప్రయోజనాలుగా భావిస్తుంటారు. అయితే, సద్గురు హఠ యోగా వల్ల శారీరకంగా పలు ప్రయోజనాలు లభించినా, అవన్నీ కేవలం సైడ్ ఎఫెక్టులు మాత్రమే అని  చెబుతున్నారు. మానవుని పూర్తి సామర్ధ్యాన్ని తెలుసుకోవడానికి, విశ్వాన్నే మీలోకి “డౌన్లోడ్” చేసుకునేందుకు తగినట్టుగా శరీర వ్యవస్థను మలచుకోవడానికి ఉపయోగపడే ఒక శక్తివంతమైన వ్యవస్ధే ‘సాంప్రదాయ హఠ యోగ ‘అని ఆయన ఈ వ్యాసంలో తెలియజేస్తున్నారు.
 
ఈ సృష్టి అంతా ఒక రకమయిన “జామెట్రీ” అంటే రేఖాగణితం, అలాగే మీ శరీరం కూడా. ఇది శరీరాన్ని ఒక అద్భుతమైన అవకాశంగా మారుస్తుంది. బహుశా ఈ రోజులలో, ఈ సమస్య ఇక లేదు కానీ, కొన్ని సంవత్సారాల క్రితం, తుఫాను వచ్చిపోయిన ప్రతిసారీ, పైకి వెళ్లి టీవి(TV) యాంటెనాని సరి చేసుకోవాల్సి వచ్చేది. అది ఒకవిధమైన కోణంలో ఉంటేనే మీ టీవిలో ప్రసారాలు వచ్చేవి, లేదా మీరు క్రికెట్ చూస్తున్నప్పుడో లేదా సీరియల్ చూస్తున్నప్పుడో అకస్మాత్తుగా మీ టీవిలో చుక్కలు వచ్చేవి. అప్పుడు మీరు యాంటెనాని సరిచేయవలసి వచ్చేది.
 
ఈ శరీరం కూడా అలాంటిదే : మీరు దానిని సరైన స్ధితిలో ఉంచితే, అది పూర్తి విశ్వాన్ని గ్రహించగలదు. మీరు దానిని వేరే విధంగా ఉంచితే, మీకు మీ పంచేంద్రియాలు తప్ప ఇంకేమీ తెలియవు. మన శరీరం ఒక బారోమీటర్ వంటిది. మీకు దానిని ఎలా చూడాలో తెలిస్తే, అది మీ గురించి, మీ చుట్టూ ఉన్న ప్రపంచం గురించి అంతా తెలియజేస్తుంది. మీ శరీరం మీకు ఎప్పుడూ అబద్ధం చెప్పదు, అందుకనే మనం యోగాలో మన శరీరాన్ని నమ్మటం నేర్చుకుంటాము. యోగా ద్వారా మనం మన భౌతిక శరీరంలో జరిగేకొన్ని నిర్బంధపు ప్రక్రియలను స్పృహతో జరిపే ప్రక్రియలుగా మారుస్తాం. తద్వారా శరీరాన్ని అన్నింటినీ గ్రహంచగలిగే, తెలుసుకోగలిగే ఒక శక్తివంతమైన పరికరంగా మారుస్తాం.
 
శరీరం అతి గొప్ప పరికరం
ఈ శరీరాన్ని, కేవలం మనం ఈ భూమి నుండి సేకరించిన ఒక ఆహారపు కుప్పగానో  లేక నిర్బంధపు ప్రక్రియలు జరిగే రసాయనాల సమ్మేళనంగానో లేక రక్త మాంసాలగానో కాకుండా, వాటికి మించిన దానిగా తయారుచేయడానికి ఒక సైన్స్, టెక్నాలజీ ఉంది. మీకు శరీరాన్ని ఎలా చదవాలో తెలిస్తే, అది మీ సామర్ధ్యాన్ని, మీ పరిమితులని, మీ భూత, భవిష్యత్, వర్తమానాలన్నిటినీ మీకు తెలియజేస్తుంది. అందుకనే, ప్రాధమికమైన యోగా శరీరంతో మొదలవుతుంది. దీనిని ఇలా వివరించవచ్చు. 
 
మీ ఫోన్ లేదా మీ దగ్గర ఉన్న ఏదైనా పరికరం గురించి మీకు ఎంత ఎక్కువ తెలిస్తే, మీరు దానిని అంత బాగా ఉపయోగించుకోగలరు. కొన్ని సంవత్సరాల క్రితం భారతదేశంలో ఫోన్ కంపెనీలు ఒక సర్వేని చేసి తెలుసుకున్నది ఏమిటంటే 97% మంది తమఫోను సామర్ధ్యంలో కేవలం 7% మాత్రమే ఉపయోగిస్తున్నారని (నేను నేటి స్మార్ట్ ఫోన్ల గురించి మాట్లాడటం లేదు, ఆ రోజుల్లోని డబ్బా ఫోన్ల గురించి మాట్లాడుతున్నాను!) ఆ చిన్న పరికరంలోనే మీరు 7% వాడుతున్నారు. మరి మీ శరీరం విషయానికొస్తే, అది అసలైన పరికరం. ఈ ప్రపంచంలోని ప్రతి పరికరం కూడా దీని నుండే వచ్చింది.
 
మరి మీరు ఈ పరికరంలో ఎంత శాతాన్ని వాడుతున్నారని అనుకుంటున్నారు?1% కంటే కూడా చాలా తక్కువ. ఈ భౌతిక ప్రపంచంలో జీవించడానికి, అంటే మీ మనుగడ కోసం, మీ శరీరంలో 1% కూడా మీకు అవసరం లేదు. మనం దీనితో ఎన్నో పనికిమాలిన పనులు చేస్తున్నాము, ఎందుకంటే ప్రస్తుతం మనం ఉనికిలోని భౌతిక భాగాన్ని మాత్రమే గ్రహించగలుగుతున్నాం. కానీ మీ శరీరానికి పూర్తి విశ్వాన్ని గ్రహించగల సామర్ధ్యం ఉంది. మీరు కనుక దానిని సరిగ్గా సిద్ధం చేస్తే, అది ఉనికిలోని ప్రతి దానిని గ్రహించగలదు, ఎందుకంటే ఉనికిలో జరిగే ప్రతిదీ కూడా ఒక విధంగా మన భౌతిక శరీరంలో కూడా జరుగుతుంది.
 
తరువాతి అడుగు
మనిషి సాధారణంగా నిముషానికి 12 నుండి 15 సార్లు శ్వాస తీసుకుంటాడు. మీరు కనుక దానిని 11 కి తగ్గిస్తే, మీకు భూగోళపు బాహ్య పొర గురించి తెలుస్తుంది. మీరు దానిని 9కి తగ్గిస్తే, మీకు ఈ భూమండలంలోని ఇతర ప్రాణుల భాష అర్ధమవుతుంది. మీరు దానిని 7కి తగ్గిస్తే, మీకు ఏకంగా భూగోళపు భాషే అర్ధమవుతుంది. మీరు దానిని 5కి తగ్గిస్తే, మీకు ఈ సృష్టి మూలం యొక్క భాష అర్ధమవుతుంది. ఇది మీ ఏరోబిక్ సామర్ధ్యాన్ని పెంచడం గురించి లేదా బలవంతంగా మీ శ్వాసను బిగపట్టడం గురించీ కాదు. మీరు హఠ యోగ, క్రియలను కలిపి చేయడం ద్వారా మీ ఊపిరితిత్తుల సామర్ధ్యాన్ని క్రమంగా పెంచుకోవచ్చు. అయితే అన్నిటిని మించి, అవి మీ శారీరక వ్యవస్థలో ఒక విధమైన అలైన్‌మెంట్‌ని(సర్దుబాటుని), ఒక విధమైన సౌలభ్యాన్ని సాధించడానికి దోహదపడుతాయి. దాంతో మీ వ్యవస్ధ ఎటువంటి అలజడులు లేని ఒక స్థిరత్వాన్ని పొందుతుంది. అప్పుడు అది అన్నిటినీ గ్రహిస్తుంది.
- సద్గురు
మంచు లక్ష్మి యోగ చూడండి... 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఫెంజల్ తుపాను: కడపలో ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరిక, తిరుపతి నుంచి వెళ్లాల్సిన 4 విమానాలు రద్దు

అదానీ కంపెనీలో ఒప్పందాలు జగన్‌కు తెలియవా? పురంధేశ్వరి ప్రశ్న

కొనసాగుతున్న ఉత్కంఠత : 24 గంటల్లో కీలక ప్రకటన..?

రాంగోపాల్ వర్మ ఎక్కడున్నారు? పోలీసులు ఎందుకు ఆయన కోసం వెతుకుతున్నారు

ఏక్‌నాథ్ షిండేను తప్పించే వ్యూహాల్లో కమలనాథులు : శివసేన నేత ఆరోపణలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్ సిద్దమైంది

ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ కిష‌న్ హీరో

రానా హాజరయ్యే గ్యాదరింగ్స్ లో శ్రీలీల తప్పనిసరి ఎందుకోతెలుసా

పుష్ప సాధారణ సినిమానే, కానీ ప్రేక్షకల ఆదరణతో గ్రాండ్ గా పుష్ప-2 చేశాం : అల్లు అర్జున్‌

వరుస ఫ్లాప్‌లు... అయినా ఛాన్సులు.. 'డ్యాన్సింగ్ క్వీన్‌' సీక్రెట్ ఏంటోమరి?

తర్వాతి కథనం
Show comments