Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విశ్వ యోగం : ఘనంగా యోగా డే... ప్రపంచాన్ని ఏకంచేసే మంత్రం.. మోడీ

అంతర్జాతీయ యోగదినోత్సవ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ఘనంగాజరిగాయి. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు.. కేంద్ర మంత్రులు, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. అలాగే,

Advertiesment
International Yoga Day 2017 Live
, బుధవారం, 21 జూన్ 2017 (10:14 IST)
అంతర్జాతీయ యోగదినోత్సవ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ఘనంగాజరిగాయి. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు.. కేంద్ర మంత్రులు, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. అలాగే, ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఈ వేడుకల్లో ప్రపంచ దేశాధినేతలు పాల్గొని యోగాసనాలు వేశారు. 
 
ముఖ్యంగా లక్నోలోని రమాబాయి అంబేద్కర్ మైదానంలో నిర్వహించిన జరిగిన యోగా కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... యోగా అనేది ఆరోగ్యమైన మనసుతోపాటు, ఉత్తమ జీవన కళను నేర్పిస్తుందన్నారు. లక్నోలోని ప్రజలు ఈ యోగా కార్యక్రమానికి పెద్దఎత్తున తరలిరావడం ఆనందంగా ఉంది. యోగా అనేది ప్రపంచాన్ని ఏకం చేస్తుంది. గడచిన మూడు సంవత్సరాల్లో యోగా నేర్చుకునే వారి సంఖ్య మరింత పెరిగిందని గుర్తుచేశారు. 
 
యోగా... ఫిట్‌నెస్‌తో పాటు వెల్‌నెస్‌ను అందిస్తుంది. యోగా మన జీవితంలో ఒక భాగం. మొదటిసారి యోగాభ్యాసం చేస్తున్న వారికి తమ శరీరం చైతన్యవంతమవుతున్నట్లు తెలుస్తుంది. ఒక విషయం గుర్తుంచుకోండి... జీవితంలో ఉప్పు ఒక్కటి ఉంటేనే సరిపోదు. అయితే ఉప్పు అనేది లేకపోతే జీవితమే ముందుకు నడవదు అని అన్నారు. ప్రసంగం అనంతరం మోడీ 55 వేల మంది ప్రజల మధ్య యోగాభ్యాసం చేశారు. కార్యక్రమానికి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్, పలువురు మంత్రులు హాజరయ్యారు. 
 
ఇదిలావుండగా, ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా గ్రేట్ వాల్ ఆఫ్ చైనాపై యోగాద్భుతం ఆవిష్కృతమైంది. భారత ఎంబసీ, యోగి యోగా సంస్థల ఆధ్వర్యంలో వందలాది మంది చైనీయులు గ్రేట్ వాల్‌పై యోగాసనాలు వేశారు. భారత తర్వాత ప్రపంచంలో అత్యధికు ప్రజలు యోగా చేసేది చైనాలోనే కావడం గమనార్హం. ఇక యోగా డే జరపాలన్న భారత ప్రతిపాదనకు మద్దతు పలికిన చైనా ప్రభుత్వం ప్రతి సంవత్సరమూ అధికారికంగా యోగా డేను నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. ఇక గ్రేట్ వాల్ ఆఫ్ చైనాతో పాటు, బీజింగ్ తదితర ముఖ్య నగరాల్లోనూ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హాయ్‌.. డార్లింగ్‌ డార్లింగ్‌... హలో చెప్పు... : రాజీవ్ - శిరీష ఫోన్ సంభాషణ...