Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హాయ్‌.. డార్లింగ్‌ డార్లింగ్‌... హలో చెప్పు... : రాజీవ్ - నవీన్ - శిరీష ఫోన్ సంభాషణ...

హైదరాబాద్ బ్యుటీషియన్‌ శిరీష ఆత్మహత్య కేసులో రోజుకో కొత్తకోణం వెలుగుచూస్తోంది. సరికొత్త ట్విస్ట్‌లతో పోలీసులనూ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కొంతకాలం క్రితం తన ప్రియుడు రాజీవ్‌తో, మరో ఇద్దరు యువకులతో శిర

Advertiesment
Beautician Sirisha and Rajeev Leaked Phone Call
, బుధవారం, 21 జూన్ 2017 (09:53 IST)
హైదరాబాద్ బ్యుటీషియన్‌ శిరీష ఆత్మహత్య కేసులో రోజుకో కొత్తకోణం వెలుగుచూస్తోంది. సరికొత్త ట్విస్ట్‌లతో పోలీసులనూ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కొంతకాలం క్రితం తన ప్రియుడు రాజీవ్‌తో, మరో ఇద్దరు యువకులతో శిరీష మాట్లాడిన 2 నిమిషాల వ్యవధి గల ఆడియో క్లిపింగ్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. తాజాగా బయటపడిన ఆడియోలో ఆమె నోటి నుంచి వచ్చిన నందు, నవీన్‌ అనే రెండు కొత్తపేర్లు కేసులో కీలకంగా మారాయి. 
 
తేజస్విని పేరు ప్రస్తావించకుండా.. ఆమెపై కోపాన్నంతా శిరీష ఆ ఆడియోలో వెలిబుచ్చింది. ఆమె తన శత్రువని స్పష్టం చేసింది. తనను డిస్టర్బ్‌ చేసిన ఆమెను వదలకూడదని ఆగ్రహంగా పేర్కొంది. ఆర్జే ఫొటో స్టూడియోలో పనిచేసే ఆరుగురు యువకుల్లో ఎవరో ఒకరు ఈ ఆడియో సంభాషణను బయటపెట్టి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఆడియో క్లిపింగ్‌పై పోలీసులు ఆరా తీస్తున్నారు. రాజీవ్, శిరీషల మధ్య జరిగిన ఫోను సంభాషణ క్లుప్తంగా...
 
రాజీవ్‌: హలో..
శిరీష: హలో చెప్పు.
రాజీవ్‌: హాయ్‌.. డార్లింగ్‌ డార్లింగ్‌ నాకు రికార్డింగ్‌ అయితే కనబడట్లేదు.
శిరీష: ఒకసారి నీ పక్కనున్న రవికి ఫోనివ్వు.
రాజీవ్‌: నా పక్కన రవి అని ఎవరుండరు. నా పక్కన ఉండేది నవీన్‌.
శిరీష: అదే వాడికి ఫోనివ్వు. (రాజీవ్‌ ఫోన్‌ని నవీన్‌కి ఇచ్చాడు)
శిరీష: ఇందాక మాట్లాడింది ఇతడే కదా.. గుర్తుందా నేను శిరీషని. ఇందాకా మాట్లాడాను.
నవీన్‌: బాబోయ్‌ గుర్తుంది. నేనే మాట్లాడింది నవీన్‌ని.. రికార్డింగ్‌ కాల్‌ పంపించమన్నావు నువ్వేకదా!
శిరీష: నేనే.. నేనే రికార్డింగ్‌ కాల్‌ కావాలన్నాను. నవీన్‌కి రికార్డింగ్‌ ఎక్కడుందో తెలియట్లేదంట. కొంచెం వెతికి పంపించవా.
నవీన్‌: నందూ అయితే దాన్ని గలీజ్‌గలీజ్‌గా తిట్టాడు
శిరీష: తిట్టాడు. కానీ ఆ రికార్డు నాకు కావాలి.
నవీన్‌: ఇంతకీ ఆమె నీకు ఏమైద్ది ఫ్రెండా.. ఎనిమీనా?
శిరీష: అది నా ఎనిమీ.
నవీన్‌: ఇంక నువ్వు హ్యాపీగా ఉండు. నందూ దాన్ని బాగా తిట్టాడు. దానికైతే టార్చర్‌ చూపెట్డాడు.
శిరీష: లేదు నాకు ఆ రికార్డు కావాలి. ప్లీజ్‌ అర్ధం చేసుకోండీ.
నవీన్‌: ఒక్క నిమిషం శిరీష నేను చెక్‌ చేస్తాను. వాట్సప్‌ నుంచి ఒక్కసారి హాయ్‌ పెట్టు.
... అంటూ సంభాషణ ముగించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలబాలికలపై ముంబై ఉపాధ్యాయుడి లైంగిక వేధింపులు... పంతులుకి అరదండాలు