Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యోగ చేయడానికి కండిషన్స్... ఏంటవి?, తమాషా కాదు...

యోగసనాలు ఎవరుబడితే వారు వేయకూడదు. యోగసనాలు వేసేవారు పాటించాల్సిన అంశాలు కొన్ని వున్నాయి. అవి ఆసనాలకు కేటాయించే సమయం. తర్వాత ప్రాణాయామం, ధ్యానంకు నిర్దేశించుకున్న సమయం. ఇందుకు సంబంధించి ప్రతి రోజు యోగకు గంట సమయం కేటాయించాలి. దానిలో అరగంట ఆసనాలకు, పది

యోగ చేయడానికి కండిషన్స్... ఏంటవి?, తమాషా కాదు...
, మంగళవారం, 20 జూన్ 2017 (20:42 IST)
యోగసనాలు ఎవరుబడితే వారు వేయకూడదు. యోగసనాలు వేసేవారు పాటించాల్సిన అంశాలు కొన్ని వున్నాయి. అవి ఆసనాలకు కేటాయించే సమయం. తర్వాత ప్రాణాయామం, ధ్యానంకు నిర్దేశించుకున్న సమయం. ఇందుకు సంబంధించి ప్రతి రోజు యోగకు గంట సమయం కేటాయించాలి. దానిలో అరగంట ఆసనాలకు, పది నిమిషాలు ప్రాణాయామం, ఇరవై నిమిషాలు ధ్యానంకు కేటాయించుకుంటే మంచి ఫలితం వస్తుంది. 
 
ఆసనాలు వేస్తున్నామని ఇప్పటికే వాడుతున్న మందులు, వైద్యులను సంప్రదించటాన్ని మాత్రం మానకూడదు. తర్వాత ఆసనాలు వేసే విషయంలో ఏ ఇబ్బంది వచ్చినా దగ్గరిలోని యోగ మాష్టారును సంప్రదించి ఆసనాలను సరిగా వేస్తున్నారో లేదో నిర్ధారించుకోవాలి. ఆసనాలు వేసే ముందు కొన్ని అంశాలను పాటించాల్సివుంది.
 
* ఎనిమిది నుంచి 60 సంవత్సరాల వాళ్లు మాత్రమే యోగ చేయాలి.
* తెల్లవారు జామునే లేచి కాలకృత్యాలు తీర్చుకోవాలి.
* ఆసనాలు వేసే ముందుగా గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి.
* తెల్లవారు జామునే ఆసనాలు వేయాలి. ఆ సమయంలో గాలిలో ప్రాణశక్తి ఎక్కువగా వుంటుంది. గాలి బాగా వచ్చే ప్రదేశం చూసుకుని వేయాలి.
* శబ్దాలు, గోలలు లేకుండా వుండే ప్రదేశాన్ని ఎన్నుకోవాలి.
* పలుచటి బట్ట నేలపై పరిచి పద్మాసనం లేదా సుఖాసనం ఇష్టమైన ఆసనాన్ని వేయాలి.
* ప్రశాంతంగా కనులు మూసుకోవాలి.
* ధ్యాస శ్వాస మీదే నిలపాలి.
* గాలి వదిలినప్పుడు పొట్ట లోపలకు, పీల్చినపుడు ముందుకు వస్తుందో లేదో గమనించాలి. (దీనికై, పొట్ట ద్వారా కాకుండా, ఛాతీ ద్వారా గాలి పీలుస్తుంటే మాత్రం మీ శ్వాస సరి కాదని గుర్తించాలి.)
* ఆసన ప్రారంభ సమయంలో పద్మాసనం, వజ్రాసనం ఏదైనా వేయవచ్చు.
* ఆసనం ఎప్పుడూ నెమ్మదిగా వేయాలి. ఏమాత్రం తొందరపడకూడదు.
* వేసిన ఆసనంలో కొద్ది సెకన్ల పాటు అలాగే వుండాలి.
* ఆసనం వేసేటపుడు ఎంత నెమ్మదిగా వేస్తామో అంతకంటే నెమ్మదిగా మామూలు స్థానంలోకి రావాలి.
* కుంభకం వేసేటపుడు అధిక రక్తపోటు వున్నవారు కేవలం పది సెకన్లు మాత్రమే చేయాలి.
* గాలి పీల్చటం, వదలటం లాంటి ఆసనాల్లో పైకి శబ్దం వచ్చేలా వదలటం, పీల్చటం చేయకూడదు. ప్రతిదీ నెమ్మదిగా, సరళంగా ప్రశాంతంగా చేయాలి.
* ఏ ఆసనం అయినా సరే రొప్పుతూ, ఆయాసపడుతూ చేయకూడదు. శరీర సామర్థ్యాన్ని గుర్తించి అంత సేపే వుండాలి. అంతేకాని అలుపుసొలుపు లేకుండా యోగ చేయాలనుకుంటే సమస్యను కొని తెచ్చుకున్నట్లే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సన్నగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఏం చెయ్యాలి?