Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉబ్బసాన్ని తరిమికొట్టే ఉష్ట్రాసనం....

సంస్కృతిలో ఉష్ట్రం అనే పదానికి ఒంటె అని అర్థం. అందుకనే ఈ భంగిమతో కూడిన వ్యాయామరీతిని ఒంటె భంగిమ అని పిలుస్తున్నారు. ఒంటె భంగిమ అనేది శర భంగిమకు ఊర్ధ్వశబ భంగిమకు మధ్యస్థంగా ఉంటుంది. మోకాళ్ల వద్ద కాళ్లన

Webdunia
మంగళవారం, 26 జూన్ 2018 (11:32 IST)
సంస్కృతిలో ఉష్ట్రం అనే పదానికి ఒంటె అని అర్థం. అందుకనే ఈ భంగిమతో కూడిన వ్యాయామరీతిని ఒంటె భంగిమ అని పిలుస్తున్నారు. ఒంటె భంగిమ అనేది శర భంగిమకు ఊర్ధ్వశబ భంగిమకు మధ్యస్థంగా ఉంటుంది. మోకాళ్ల వద్ద కాళ్లను వంచి ఆరు అంగుళాల దూరంలో ఉంచాలి. కాలివేళ్లు, మడమల వంపు ఆధారంగా కూర్చోవాలి. నడుము క్రింద భాగంలో వీలైనంత వెడల్పుగా ఉంచాలి. శరీరం, వెన్నెముక, మెడ సమాంతరంగా ఉంచాలి. అరచేతులను సంబంధిత మోకాళ్ల మీద ఆనించాలి.
 
మోకాళ్లమీద శరీరాన్ని వెనుకకు వంచి కుడి మడమను మీ కుడి చేతితోనూ, ఎడమ మడమను ఎడమ చేతితోనూ పట్టుకోవాలి. మడమలను గట్టిగా పట్టుకుని నడుము, తొడలను వెనక్కు వంచాలి. తలను, మెడను వీలైనంత వరకు వెనక్కు వంచాలి. కటి భాగాన్ని, నడుమును కొద్దిగా ముందుకు నెట్టాలి. శ్వాసను మూమూలుగా పీల్చి వదులుతూ ఈ స్థితిలో 6 సెకన్ల వరకు అలాగే ఉండాలి. తరువాత ఈ స్థితినుండి బయటకు వచ్చి మామూలు స్థాయికి రావాలి. ఇలా చేస్తున్నప్పుడు ముందుగా చేతులను సడలించే స్థాయిలో శరీరాన్ని గట్టిగా ఉంచాలి.
 
ఇలా చేయడం వలన మడమలు, తొడలు, శరీరం, ఛాతీ, గొంతు, కటి, పొత్తి కడుపులను దృఢంగా ఉంచడానికి ఈ భంగిమ చాలా మంచిది. ఇది మెడ, పొత్తికడుపు అంగాలను నియంత్రించుటలో సహాయపడుతుంది. ఈ భంగిమ ఉబ్బసం దుష్ప్రభావాలను తొలగించి శ్వాసకోశాలను, ఊపిరితిత్తుల పనితీరును, ముక్కు నాళికను, నరాల పనితీరును మెరుగుపరుస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఒకే బాడీ బ్యాంగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

విమాన ప్రమాదం : విజయ్ రూపానీ మృతదేహం గుర్తింపు - అప్పగింత

అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. 31 మృతదేహాల గుర్తింపు.. మిగిలినవాటి పరిస్థితి ఏంటి?

బాసరలో విషాదం - గోదావరి నదిలో మునిగి నలుగురు మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తర్వాతి కథనం
Show comments