ఉప్పు అధికంగా వద్దే వద్దు.. రోజుకు ఐదు గ్రాములే వాడాలట..
ఉప్పును వంటల్లో అధికంగా వాడటం ఆరోగ్యానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రుచి కోసం ఉప్పును చేర్చుకుంటే సరిపోతుంది కానీ.. అది మోతాదు మించితే మాత్రం ఆరోగ్యానికి అనర్ధమేనని వారు హెచ్చరిస
ఉప్పును వంటల్లో అధికంగా వాడటం ఆరోగ్యానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రుచి కోసం ఉప్పును చేర్చుకుంటే సరిపోతుంది కానీ.. అది మోతాదు మించితే మాత్రం ఆరోగ్యానికి అనర్ధమేనని వారు హెచ్చరిస్తున్నారు. రోజు ఐదు నుంచి ఆరు గ్రాముల ఉప్పు మాత్రమే ఆహారంలో చేర్చుకోవాలట. అయితే భారతీయులు 20 నుంచి 25 గ్రాముల ఉప్పును ఆహారంలో చేర్చుకుంటున్నారు.
కారం ఎక్కువ గల ఆహారంలో ఉప్పును కూడా అధికంగా చేర్చేస్తున్నారు. ఎండు చేపలు, ఎండిన మాంసాహారం, ఊరగాయలు, వడియాలు, అప్పడాలు వంటి ఆహార పదార్థాల్లో అధిక ఉప్పును వుపయోగిస్తున్నారు. అలాగే పులిహోర, చేపల పులుసుల్లో రుచి కోసం ఉప్పును అధికంగా వాడేస్తున్నారని.. తద్వారా గుండెకు ముప్పేనని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వీటితో పాటు చిప్స్, కారపు ఆహార పదార్థాల్లో అధికంగా ఉప్పును కలుపుతున్నారు. సోడియం క్లోరైడ్ అనే ఉప్పులో 40 శాతం సోడియం అనే రసాయనం వుంది. ఈ సోడియం శరీరంలో చేరడం ద్వారా కిడ్నీ, గుండె సంబంధిత రోగాలు తప్పవట. ఇంకా ఉప్పు రక్తపోటును పెంచేస్తుంది. అందుచేత వండే ఆహారంలో ఉప్పును తక్కువగా తీసుకోవడం మంచిది.
సాధ్యమైనంత వరకు కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తాజా పండ్లు, కూరగాయల్లో సోడియం శాతం తక్కువగా వుంటుంది. సోడియంకు బదులుగా పొటాషియం వుంటుంది. ఇది అధిక రక్తపోటును నియంత్రిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.