Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిరియాలను వేడినీటిలో మరిగించి తాగితే ఏమవుతుంది?

Webdunia
బుధవారం, 29 డిశెంబరు 2021 (22:22 IST)
మిరియాలు ఆరోగ్యానికి చేసే మేలు అంతాఇంతా కాదు. మిరియాల పైపొరలో ఉండే ఫైటో న్యూట్రియంట్ సమ్మేళనాలు శరీరంలో పేరుకుపోయిన కొవ్వును విచ్ఛిన్నం చేసి అనవసరమైన కొవ్వు పేరుకోకుండా కాపాడతాయి. ఫలితంగా రక్తనాళాల్లో అధిక కొవ్వు వల్ల వచ్చే రక్తపోటు నుంచి ఉపశమనం పొందవచ్చు. 

 
బరువు పెరగకుండా కూడా చూసుకోవచ్చు. ఆందోళన, ఒత్తిడి నుండి బయటపడటానికి మిరియాలలో ఉండే పైపెరైన్ అనే గుణం తోడ్పడుతుంది. శీతాకాలంలో జలుబు, దగ్గుతో బాధపడేవారు పాలలో మిరియాల పొడి కలుపుకుని తాగాలి లేదా మిరియాల రసం తాగితే కూడా మంచిదే. 

 
50 గ్రాముల మిరియాల పొడిని 600 మి.లీ నీళ్లలో చేర్చి అరగంట మరిగించాలి. ఆ నీటిని రోజుకు మూడుసార్లు తాగితే మంచిది. మిరియాల టీలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఈ విటమిన్ వైరస్, బ్యాక్టీరియాతో పోరాడే సామర్థ్యాన్ని రోగ నిరోధక వ్యవస్థకు చేరుస్తుంది. చిటికెడు మిరియాల పొడిని బాదంపప్పుతో కలిపి తీసుకుంటే కండరాలు, నరాల నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Nagababu: శాసన మండలి సభ్యుడిగా నాగబాబు ప్రమాణ స్వీకారం

నియంత్రణ రేఖ దాటొచ్చిన పాకిస్థాన్‌ సైన్యానికి భారత్ చేతిలో చావుదెబ్బ!

కంచా అడవిని కాపాడండి-బంజరు భూముల్ని వాడుకోండి- దియా, రేణు దేశాయ్, రష్మీ గౌతమ్ విజ్ఞప్తి

శునకంతో స్టంట్ చేసిన వ్యక్తి.. రైలు కింద పడిపోయింది.. తిట్టిపోస్తున్న నెటిజన్లు (video)

ప్రధాని మోడీ గారూ.. సమయం ఇవ్వండి.. నియోజకవర్గాల పునర్విభజనపై చర్చించాలి : సీఎం స్టాలిన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

Niharika: సంగీత్ శోభన్ హీరోగా మరో సినిమాను నిర్మిస్తోన్న నిహారిక కొణిదెల

సమంత శుభం టీజర్ అద్భుతం.. కితాబిచ్చిన వరుణ్ ధావన్ (video)

తెనాలిలో సమంతకి గుడి కట్టిన శామ్ అభిమాని- ట్రెండింగ్‌లో ఫోటోలు, వీడియోలు

Prabhas: ప్రభాస్ ఆరోగ్య సమస్య వల్లే రాజా సాబ్ చిత్రం ఆలస్యం అవుతుందా !

తర్వాతి కథనం
Show comments