Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనావైరస్ సమయంలో తులసి ఆకులను అలా చేసి తీసుకోవాల్సిందే...

Webdunia
బుధవారం, 24 జూన్ 2020 (22:05 IST)
తులసిలో ఔషధ గుణాలు వున్నందున ఆ ఆకుల కషాయాన్ని జలుబు, ఊపిరితిత్తులలో ఇబ్బందులను తొలగించేందుకు వినియోగిస్తారు. పర్వదినాలలో దేవతలకు చేసే నివేదనలలోను, కొన్ని ప్రత్యేక విందులలోనూ అతిథులకు ఆహారపదార్థాలపై తులసి ఆకును వుంచి అందించడం సంప్రదాయం. 
 
రోగ నిరోధక శక్తిని పెంచడంలో తులసిని మించిన ఔషధ మొక్క మరొకటి లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు. తులసి ఆకుల రసం, తులసి టీ సర్వరోగ నివారణిలు, ఏదో ఒక రూపంలో తులసిని తరచూ తీసుకోవాలట. అలా చేస్తే ఎంతో ఉపయోగకరమంటున్నారు.
 
నీడలో ఎండబెట్టిన తులసి ఆకులు, రెమ్మలు శుభ్రం చేసి వేళ్ళతో సహా తులసికి సంబంధించినవన్నీ ఒకే గుణం కలిగి ఉంటాయి. ఎండిన తులసిని దంచి అందులోకి యాలకుల పొడి, మిరియాల పొడి, పుదీనా ఆకుల పొడి తగుపాళ్ళలో కలిపి సీసాలో భద్రపరుచుకోవాలి. ఈ పొడిన గ్లాసు నీళ్ళలోకి వేసి మరగకాచి అందులో నిమ్మరసం కలుపుకుని రోజుకు మూడు పూటలా టీలాగా సేవించాలి.
 
కొన్ని రకాల తులసి మొక్కల్లో యూజెనాల్, సిట్రాల్, కర్పూరం, థైమాల్ లాంటి శక్తివంతమైన రసాయనాలు ఉంటాయి. అందుకే తులసిని సూక్ష్మజీవి నాశకం అంటారు. రేడియేషన్ చికిత్సలో ఆరోగ్య కణాలు దెబ్బతినకుండా తులసి కాపాడుతుందట. లవంగం వేసి వండే వంటకాల్లో తులసి ఆకుల్ని కూడా వేసి వండుకోవచ్చట. ఇలా చేయడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందట.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments