Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనా వైరస్, రోగనిరోధక శక్తికి ఆ ఒక్కటి? (Video)

Advertiesment
కరోనా వైరస్, రోగనిరోధక శక్తికి ఆ ఒక్కటి? (Video)
, శనివారం, 6 జూన్ 2020 (20:31 IST)
అసలే కరోనా వైరస్ వ్యాపిస్తున్న సమయం. మనుషుల్లో రోగ నిరోధక శక్తి ఉంటే వైరస్ దరిచేరే అవకాశమే లేదంటున్న వైద్యులు. ఇలాంటి సమయంలో రోగనిరోధక శక్తి మన శరీరంలో పెరగాలంటే తేనె ఎంతో ముఖ్యమంటున్నారు ఆరోగ్య నిపుణులు. తేనెను రెగ్యలర్‌గా వాడితే ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. 
 
ముఖ్యంగా ఊపిరితిత్తులు, శ్వాస సంబంధ సమస్యలున్నవారు గోరువెచ్చటి నీటిలో కొంచెం తేనె, మిరియాల పొడి వేసి తాగితే జలుబు దగ్గుతుందట. అలాగే కొత్త తేనె శ్లేష్మాన్ని తగ్గిస్తుందట. పాత తేనె తీసుకుంటే మలబద్ధకం ఉండదట. తేనె ఎంత పాతబడితే అంతమంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.
 
ఆయాసం, దగ్గు, కఫంతో బాధపడేవారు అరచెంచా తేనెను వేడినీళ్ళలో వేసుకుని తాగితే ఉపశమనం లభిస్తుందట. ఇలా రోజూ మూడు నుంచి నాలుగుసార్లు చేయాలట. అలాగే అజీర్ణం వల్ల కడుపునొప్పి వస్తే అరకప్పు వేడినీటిలో రెండు చెంచాల తేనె, వేయించిన వాము చెంచా వేసి తాగితే కడుపు నొప్పి తగ్గుతుందట. 
 
గోరువెచ్చటి నీళ్ళలో అరచెంచా తేనె వేసుకుని పుక్కిలిస్తే గొంతునొప్పి, చిగుళ్ళ వాపు తగ్గుతుందట. కాఫీ, టీలకు బదులు గ్రీన్ టీలలో కొద్దిగా తేనె వేసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుందట. కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్న వాళ్ళు తేనెను గోరువెచ్చటి నీళ్ళలో కలిపి రోజుకోసారి తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరగకుండా ఉంటుందట.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెసరట్టు వారానికి రెండు సార్లు తీసుకుంటే?