Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాగా సన్నగా ఉన్నవారు రోజూ ఖర్జూరాన్ని తింటే...?

ఖర్జూరాలు మనకు మార్కెట్లో సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే విధంగా దొరుకుతాయి. ఇవి ఆరోగ్యానికి పలు రకాలుగా మేలు చేస్తాయి. ఖర్జూరాలలో కొలస్ట్రాల్ ఉండదు. ఖర్జూరాలను ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఇవి శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. ఇందులో అ

Webdunia
సోమవారం, 9 ఏప్రియల్ 2018 (19:32 IST)
ఖర్జూరాలు మనకు మార్కెట్లో సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే విధంగా దొరుకుతాయి. ఇవి ఆరోగ్యానికి పలు రకాలుగా మేలు చేస్తాయి. ఖర్జూరాలలో కొలస్ట్రాల్ ఉండదు. ఖర్జూరాలను ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఇవి శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. ఇందులో అనేక రకములైన పోషకాలు ఉన్నాయి. ఇందులో విటమిన్-ఎ, బిలతో పాటు ఐరన్, పాస్పరస్, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. వీటిని పాలతో కలిపి తీసుకోవడం వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చు. అవేంటంటే.....
 
1. అత్యంత తియ్యగా ఉండే ఈ ఖర్జూరంలో గ్లూకోజ్, ప్రక్టోజ్‌లు అధికంగా ఉంటాయి. ఖర్జూరం రోజూ తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉండి, గుండెకు సంబందించిన వ్యాధులను దూరంగా ఉంచుతుంది. గుండెకు బలాన్ని చేకూరుస్తుంది.
 
2. ఇందులో యాంటీఆక్సీడెంట్ల రూపంలో ఉండే విటమిన్-సి కంటికి చాలా మంచిది. దీనిని ప్రతిరోజు తీసుకోవడం ద్వారా కంటికి సంబంధించిన సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.
 
3. ఖర్జూరాలు ఆరోగ్యకరమైన బరువు పెంచడానికి సహాయపడుతాయి. బాగా సన్నగా ఉన్నవారు రోజూ ఖర్జూరాన్ని తినడం వల్ల సహజంగా బరువు పెరుగుతారు. కాబట్టి రోజువారి ఆహారంలో ఖర్జూరాన్ని చేర్చుకోవడం మంచిది.
 
4. కిడ్నీల్లో ఏర్పడే రాళ్లను కరిగించే శక్తి ఖర్జూరాలకు ఉంది. అంతేకాకుండా మూత్ర సంబంధిత సమస్యలను, ఇన్‌ఫెక్షన్లని దూరం చేస్తుంది. రాత్రి పూట నీటిలో నాలుగు ఖర్జూరాలను నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగడం వల్ల మలబద్ధకాన్ని తగ్గించుకోవచ్చు. ఖర్జూరంలో ఉండే ఫైబర్ మలబద్దకాన్ని తగ్గిస్తుంది.
 
5. ఇవి ఎముకల దృఢత్వానికి బాగా ఉపకరిస్తాయి. ఇందులో క్యాల్షియం, మెగ్నీషియం, కాపర్ సమృద్ధిగా ఉన్నాయి. దంతాలను దృఢపరచడంలో ఇవి కీలక పాత్ర వహిస్తాయి. అంతేకాకుండా జలుబు, గొంతులో శ్లేష్మాన్ని తగ్గిస్తుంది. రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది. ఇందులో ఉండే ఔషధ గుణాలు పెద్దప్రేగులోని సమస్యలను నివారిస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బాలీవుడ్ నటుడు అజాజ్ ఖాన్ భార్య అరెస్టు!!

ఏపీలో ఒక రోజు ముందుగానే సామాజిక పింఛన్ల పంపిణీ.. నేమకల్లుకు సీఎం బాబు

ఆంధ్ర నుంచి ఆఫ్రికాకు రేషన్ బియ్యం, కాకినాడ పోర్టు స్మగ్లింగ్ కేంద్రంగా మారిందా?

రేవంత్ రెడ్డి "ఏఐ సిటీ"కి శంకుస్థాపన ఎప్పుడో తెలుసా?

హైదరాబాద్‌- 50వేల కేసులు, రూ.10.69 కోట్ల ఫైన్.. 215మంది మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

తర్వాతి కథనం
Show comments