మహిళల ఎముకలకు శృంగారంతో బలమేనట...
మూడు పదుల వయస్సు రావడంతో మహిళల్లో ఎముకల బలం తగ్గుతూ వస్తుంది. మెనోపాజ్ సమయంలో ఈస్ట్రోజెన్ స్థాయిలు పడిపోవడం కారణంగా చాలామంది మహిళలు ఆస్టియోపోరోసిస్ బారినపడుతుంటారు. ఆస్టియోపోరోసిస్ బారిన పడకుండా తప్పి
మూడు పదుల వయస్సు రావడంతో మహిళల్లో ఎముకల బలం తగ్గుతూ వస్తుంది. మెనోపాజ్ సమయంలో ఈస్ట్రోజెన్ స్థాయిలు పడిపోవడం కారణంగా చాలామంది మహిళలు ఆస్టియోపోరోసిస్ బారినపడుతుంటారు. ఆస్టియోపోరోసిస్ బారిన పడకుండా తప్పించుకోవాలంటే.. వారంలో కనీసం రెండుసార్లైనా మహిళలు శృంగారంలో పాల్గొనాలని వైద్యులు సూచిస్తున్నారు.
వారానికి రెండుసార్లు శృంగారంలో పాల్గొనే మహిళల్లో ఈస్ట్రోజెన్ హార్మోన్ మిగిలినవాళ్ల శాతంకన్నా రెట్టింపు ఉంటుంది. దాంతో ఎముకలకు బలం చేకూరుతుంది. అంతేగాకుండా వారానికి మూడుసార్లు శృంగారంలో పాల్గొనే మహిళల్లో పక్షవాతం, గుండెజబ్బులు కూడా రావని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. మహిళల అందానికి కూడా శృంగారం ఎంతో మేలు చేస్తుందట.
వారానికి మూడుసార్లు శృంగారంలో పాల్గొనే మహిళలకు ప్రత్యేకించి.. క్రీములు, కాస్మెటిక్స్ అవసరం లేదని ఇప్పటికే అధ్యయనాలు కూడా తేల్చాయి. శృంగారంలో పాల్గొనే వారు వయసు మీదపడినా యవ్వనంగా కనిపిస్తారని వైద్యులు చెప్తున్నారు.
శృంగారం మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుందని.. శృంగారం కారణంగా ఎండార్ఫిన్లు ఎక్కువగా విడుదలవుతాయి. ఫలితంగా ఒత్తిడి తగ్గుతుంది. ఇంకా రోగనిరోధకశక్తి వృద్ధి చెందుతుందని.. మైగ్రేయిన్, కీళ్లనొప్పులు బాధలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.