అలా శక్తి లేనట్లుంటే ఈ ఒక్క పండు తిని చూడండి...

ఎప్పుడైనా నీరసంగా ఉన్నప్పుడు, బాగా నిసత్తువగా ఉన్నప్పుడు ఒక సపోటా పండు తిని చూడండి. కొద్ది నిముషాల్లోనే శక్తి పుంజుకుంటుంది.

Webdunia
సోమవారం, 1 అక్టోబరు 2018 (19:45 IST)
మన శరీరంలో సరైన శక్తి లేకపోతే ఏ పని సరిగా చేయలేము. శక్తి హీనత కూడా ఒక జబ్బులాగే వేధిస్తుంది. ఏ పని చేయాలన్నా అడుగు ముందుకు సాగదు. ఇదంతా మనం సరైన పోషకాలు గల ఆహారాన్ని తీసుకోకపోవడం వల్లే గానీ అదేదో రుగ్మత అని కాదు. ఎప్పుడైనా నీరసంగా ఉన్నప్పుడు, బాగా నిసత్తువగా ఉన్నప్పుడు ఒక సపోటా పండు తిని చూడండి. కొద్ది నిముషాల్లోనే శక్తి పుంజుకుంటుంది. దీనిలో ప్రక్టోజ్, సుక్రోజ్, చక్కెర ఉండడమే అందుకు కారణం. ఈ సపోటాపండు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
 
1. సపోటా పండ్లును తరచూ తింటూ ఉంటే దృష్టిలోపాలు దూరమవుతాయి. అంతేకాకుండా రోగనిరోదక శక్తి పెరగడంతో పాటు ఊపిరితిత్తులకు ఎంతో మేలు జరుగుతుంది.
 
2. ఇవి మలబద్దక సమస్యను తగ్గిస్తాయి. ఈ పండులోని కొన్ని రసాయనాలు పేగు చివరన ఉండే పలుచని శ్లేష్మపొర వ్యాధిగ్రస్తం కాకుండా కాపాడుతాయి. రక్తహీనత ఉన్నవారు, గర్భిణులు, వయోవృద్ధులు తరచూ సపోటా పండ్లను తింటే శరీరానికి అవసరమైన ఇనుము అంది రక్తహీనత నుండి బయటపడతారు. ఇందులోని పొటాషియం, మెగ్నీషియం గుండెకు కూడా ఎంతో మేలు చేస్తాయి.
 
3. సపోటాలో రక్తవృద్ధి, ధాతుపుష్టిని కలిగించే అంశాలతో పాటు మరెన్నో ఔషధ గుణాలున్నాయి. సపోటాలో శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, పీచుపదార్థాలు లభిస్తాయి. ఇందులో కాల్షియం, పొటాషియం, మాంసకృత్తులు, పిండిపదార్థాలు, సమృద్ధిగా ఉన్నాయి. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరస్ గుణాలు కూడా ఇందులో ఎక్కువే. విటమిన్-ఏ, సీ విటమిన్లు కూడా ఇందులో ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భవిష్యత్‌లో సింధ్‌ ప్రాంతం భారత్‌లో కలవొచ్చు : కేంద్ర మంత్రి రాజ్‌నాథ్

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

సి.కళ్యాణ్‌ను ఎన్‌కౌంటర్ చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుంది? 'ఐబొమ్మ' రవి తండ్రి

విమాన ప్రయాణికులకు శుభవార్త ... త్వరలో తీరనున్న రీఫండ్ కష్టాలు...

ఎక్కడో తప్పు జరిగింది... కమిటీలన్నీ రద్దు చేస్తున్నా : ప్రశాంత్ కిషోర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

తర్వాతి కథనం
Show comments