Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పెర్‌ఫ్యూమ్‌లను అక్కడ రాసుకోవద్దు.. ఎందుకంటే?

పెర్‌ఫ్యూమ్‌లను అతిగా వాడితే.. అనారోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెర్‌ఫ్యూమ్, డియోడరెంట్లు వంటి వాటిని బహుమూలాల్లో రాసుకోకూడదంటున్నారు. దుస్తులపై పెర్‌ఫ్యూమ్‌లను వాడుకోవచ్చున

పెర్‌ఫ్యూమ్‌లను అక్కడ రాసుకోవద్దు.. ఎందుకంటే?
, శుక్రవారం, 14 సెప్టెంబరు 2018 (14:16 IST)
పెర్‌ఫ్యూమ్‌లను అతిగా వాడితే.. అనారోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెర్‌ఫ్యూమ్, డియోడరెంట్లు వంటి వాటిని బహుమూలాల్లో రాసుకోకూడదంటున్నారు. దుస్తులపై పెర్‌ఫ్యూమ్‌లను వాడుకోవచ్చునని వారు చెప్తున్నారు. డియోడరెంట్లలోని రసాయనాలు, ఆల్కహాల్ వల్ల చర్మం అలెర్జీలు రావచ్చు. అలాగే చర్మం పొడిబారవచ్చు. ర్యాషెస్ ఏర్పడే అవకాశం వుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 
 
ఇక డియోడరెంట్లలో ఉండే ట్రైక్లోసాన్ అనే కీటక నివారణ మందు కారణంగా చర్మం నల్లబడుతుంది. వీటిలో ఉండే హానికారక కెమికల్స్ తలనొప్పి, తీవ్రమైన తలనొప్పికి కారణమయ్యే మైగ్రేయిన్, సైనస్ తలనొప్పికి కారణమవుతాయని వైద్యులు చెప్తున్నారు. 
 
అలాగే సుగంధ మొక్కల నుంచి తీసిన ఆయిల్‌తో తయారయ్యే సహజ బాడీ స్ప్రేలను వుపయోగిస్తే ఈ రుగ్మతల నుంచి గట్టెక్కవచ్చు. నిమ్మగడ్డి, థైమ్, లావెండర్, రోజ్ మెరీ ఆయిల్స్‌ను బహుమూలాల్లో ఉపయోగిస్తే చర్మానికి ఎలాంటి హాని వుండదు. అలాగే ఆల్కహాల్‌తో బ్యాక్టీరియా నిశిస్తుంది. కాబట్టి కొంత మోతాదులో దీన్ని బహుమూలాల్లో అప్లై చేసుకోవచ్చు.  
 
ఇదేవిధంగా.. అలోవెరా జెల్‌ను కూడా రాసుకోవడం ద్వారా చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చు. అలాగే కొబ్బరినూనెలో బాక్టీరియాను నివారించే గుణాలున్నాయి. అందుకని స్వల్పంగా రాసుకోవడం వల్ల చాలా వరకు చెమట వాసన తగ్గిపోతుంది. అలాకాకుంటే.. బేకింగ్ సోడా, కొబ్బరినూనెకు కొంచె కలుపుకుని రాసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. వీటితో పాటు యాపిల్ సిడార్ వెనిగర్‌ను కొంచెం రాసుకున్నా మంచి ఫలితం వుంటుందని స్కిన్ డాక్టర్స్ సెలవిస్తున్నారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమ్మాయిలు ఆ కలర్ దుస్తులు వేసుకున్న అబ్బాయిలకు ఫ్లాట్... లవ్ టిప్...